38.2 C
Hyderabad
April 29, 2024 12: 26 PM
Slider నల్గొండ

వీఆర్ఎ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

#vro

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ తహశీల్దారు కార్యాలయం ఎదుట జరుగుతున్న విఆర్ఎ ల నిరవధిక సమ్మెకు తమ పూర్తి మద్దతు తెలిపిన టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహ్మద్ అజీజ్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో విఆర్ఎ లకు ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు దాటినా వారి సమస్యలు పరిష్కరించరా? అని ప్రశ్నించారు.

వేతనాలు రాక ఇంకా ఎంత మంది విఆర్ఎ లు ఆత్మహత్యలు చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జిఓ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విఆర్ఎ లు సుదీర్ఘంగా 69 రోజులుగా సమ్మె కాలంలో ఉండటంతో వీరికి జీతాలు రాక ఇంటి అద్దెలు చెల్లించలేక,పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక,ఇంట్లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్థోమత లేకపోవటం,వేతనాలు రాక వారి కుటుంబ పోషణ కష్టమౌతూ ఆర్థిక భారంతో విఆర్ఎ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మహ్మద్ అజీజ్ పాషా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

విఆర్ఏలకు తక్షణమే ప్రమోషన్లు కల్పించాలి

ప్రభుత్వ పథకాలను అమలు పరిచే విషయంలో విఆర్ఎ ల పాత్ర కీలకమని, అర్హత కలిగిన విఆర్ఎ లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అవుట్సోర్సింగ్ అనే పదం ఉండదు అని చెప్పి అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం అంటూ హామీలు ఇచ్చి నేడు ఉన్న ఉద్యోగాలకు కూడా రక్షణ లేని పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి  దక్కిందని అన్నారు.పని ఎక్కువ వేతనం తక్కువ అన్నట్టుగా విఆర్ఎ ల పరిస్థితి ఉందని, వీరికి ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే  సుమారు 50 మంది విఆర్ఎ లు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని, ఇంకా ఎంత మందిని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బలి తీసుకుంటుందని అజీజ్ పాషా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఒక విఆర్ఎ లే కాకుండా తెలంగాణలో కెసిఆర్ హయాంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఆగమ్య గోచరంగానే ఉన్నదని అన్నారు. తహశీల్దార్లు ఇప్పటికే ఉన్న పని భారంతో ఇబ్బందులు పడుతున్నా,వీరి సమ్మె వలన రెవెన్యూ శాఖలో సంబంధించిన పనులు పూర్తి కాక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,55 సంవత్సరాలు నిండిన విఆర్ఎ కుటుంబ సభ్యులకు వారసత్వ విఆర్ఎ లుగా ఉద్యోగం కల్పించాలని అజీజ్ పాషా అన్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామపంచాయతీల్లో విఆర్ఎ లు సమ్మెలో ఉండటం వలన పరిపాలన పూర్తి స్థాయిలో కుంటుపడిందని అన్నారు.టిఆర్ఎస్  ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులతో సహా అన్ని సంస్థలు వ్యతిరేకతతో ఉన్నాయని,

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు విఆర్ఎ ల కోసం తమ గళాన్ని వినిపిస్తారని అన్నారు.అధికార దాహంతో హక్కులు కాలరాస్తున్న కెసిఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్న విఆర్ఎ లకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని అజీజ్ పాషా అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విఆర్ఎ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని అన్నారు.తక్షణమే ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఎ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,సమ్మెలో పాల్గొన్న విఆర్ఏ లు, ముశం సత్యనారాయణ,హుజూర్ నగర్ మండల విఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పి.వీరబాబు,కార్యదర్శి అన్నపూర్ణ,రాష్ట్ర కో-కన్వీనర్ నరసింహారావు, శ్రీనివాస్,రాంబాబు,సతీష్,సంధ్య,నాగమ్మ,రంజాన్, ఖాసీం,ఇబ్రహీం,సునీల్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్ 

Related posts

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

Satyam NEWS

వలస కార్మికులకు అండగా జన్ సహస్

Satyam NEWS

తెలంగాణ సిఎస్ గా శాంతికుమారి

Satyam NEWS

Leave a Comment