35.2 C
Hyderabad
May 1, 2024 00: 23 AM
Slider కడప

సీఎం స్వంత జిల్లాలో రక్షకుడే కీచకుడైన వేళ…

#rajampet

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ స్వంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక పోలీసు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. ఒక వివాహితను తన కామవాంఛ తీర్చాలని అతను కోరడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నది.

ఓబుల వారిపల్లి మండలంలోని చిన ఓరంపాడు పంచాయతీ రివర్స్ కాలనీకి చెందిన ఓ మహిళ ఒక విషయంపై ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఆమె వెళ్లిన విషయం ఏమిటంటే ఒక యువకుడు తన మైనర్ కూతురుని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు… ఈ విషయం ఫిర్యాదు చేసేందుకు ఆమె ఓబులవారిపల్లి పోలీసులను ఆశ్రయించింది.

అక్కడి ఎస్ ఐ ఆ మైనర్ బాలికను ట్రేస్ చేసేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ను, మరొక మహిళా కానిస్టేబుల్ ను నియమించారు. ఆ వివాహితతో వెళ్లి వివరాలు తీసుకుని ఆమె చెప్పిన విషయం కరెక్టా కాదా అని తెలుసుకుని రావాలని బాధ్యత అప్పగించారు.

బాధ్యత తీసుకున్న పోలీసులు ఆ పని లో కాకుండా ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. ఆ హెడ్ కానిస్టేబుల్ ఆ మహిళ ఉన్న పరిస్థితిని ఎడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. తన కామవాంఛ తీర్చాలని పట్టుబడుతున్నాడు.

ఆమె భర్త వల్ల సుఖం ఉండదని, తనతో ఒక రాత్రి గడిపితే సుఖ పెడతానని ఆ కామాంధుడు ఆమెపై వత్తిడి తెస్తున్నారు. పోలీసులే ఇలా చేస్తుంటే ఎవరితో చెప్పాలని ఆ మహిళ వాపోతున్నది.

ఈ సంఘటనతో జగన్ రాజ్యంలో పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని అర్ధం అవుతున్నది. కుమార్తెను ఎవడో తీసుకెళితే ఆ అమ్మాయిని రక్షించేందుకు సాయం చేయాలని పోలీసులను కోరుతున్న మహిళను కామవాంఛ తీర్చాలని కోరడం ఏమిటి? ఇదే ఏపీలో జరుగుతున్నది. పోలీసు వ్యవస్థ మొత్తం అక్కడ కుళ్లిపోయింది.

డబ్బులు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకుంటున్న వారు ఈ విధంగా ప్రజల్ని పీడించుకుతింటున్నారు. ఆమె భర్తను కేసుల్లో ఇరికిస్తానని పోలీసు హెడ్ కానిస్టేబుల్ చెబుతున్నాడు.

కానిస్టేబుల్ కామవాంఛ తీర్చకపోతే ఆమె తన భర్తను కోల్పోవాల్సి వస్తుంది. మైనర్ బాలిక వెళ్లిపోయిందనే బాధలో ఉన్న ఆమెకు ఇది మరో బాధ. ఇప్పుడు ఏం చేయాలి? ఆమెను ఎవరు కాపాడతారు?

తనను లైంగికంగా వేధించిన ఆ హెడ్ కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఆమె పత్రిక విలేకరులకు తెలియ జేశారు. తన కామవాంఛ తీర్చాలంటూ రూమ్ లో నగ్నంగా ఉండాలని ఎలాగైనా తనను అనుభవిస్తానని శపధం చేశాడు ఆ కామాంధుడు. తనను అతడు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు ఆ మహిళ విలేకరులకు తెలిపారు. అంతేకాకుండా ఆ మహిళా కానిస్టేబుల్ కూడా ఆ కామాంధుడికే సహాయం చేస్తున్నదట. సంబంధిత ఉన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నామన్నారు.

Related posts

జగన్ బాదుడు తో జనం విలవిల..

Satyam NEWS

ఎస్సీ ఎస్టీ వాడల్లో దేవాలయాల నిర్మాణం

Satyam NEWS

సమ్మర్ స్పెషల్: 26 నుంచి కోర్టులకు వేసవి సెలవులు

Satyam NEWS

Leave a Comment