27.7 C
Hyderabad
May 15, 2024 03: 42 AM
Slider ముఖ్యంశాలు

సోనాలికా నుంచి టైగర్‌ డీఐ 75 4డబ్ల్యుడీ ట్రాక్టర్‌ విడుదల

#sonalika

కిసాన్‌ దివస్‌ –2021 పురస్కరించుకుని సోనాలికా  ట్రాక్టర్స్‌ ఇప్పుడు అత్యాధునికమైన టైగర్‌ డీఐ 75 4డబ్ల్యుడీ ట్రాక్టర్‌ను పరిచయం చేసింది. అత్యున్నత సీఆర్‌డీఎస్‌ (కామన్‌ రైల్‌  డీజిల్‌ సిస్టమ్‌) టెక్నాలజీతో ఉన్న ఈ ట్రాక్టర్  ప్రత్యేక పరిచయ ధర 11–11.2 లక్షల రూపాయలుగా ఉంటుంది.  పరిశ్రమలో మొట్టమొదటి సారిగా శక్తి, ఇంధన సామర్థ్య మిళితంగా  సీఆర్‌డీఎస్‌ సాంకేతికతతో వస్తున్న టైగర్‌ 75 4 డబ్ల్యుడీ ట్రాక్టర్లు ట్రెమ్‌ 4 ఉద్గార ప్రమాణాలతో ఉంటుంది.

75 హెచ్‌పీ శక్తి, 65 హెచ్‌పీ ఇంధన సామర్థ్య మిళితంగా  కేవలం ఓ బటన్‌ టచ్‌తో వస్తుంది. వీటితో పాటుగా సోనాలికా ఇప్పుడు  టైగర్‌ డీఐ 65  4డబ్ల్యుడీ ట్రాక్టర్‌ను సైతం విడుదల చేసింది. ఇది 65 హెచ్‌పీ శక్తిని 55 హెచ్‌పీ ట్రాక్టర్‌ ఇంధన సామర్థ్యంతో అందిస్తుంది. యూరోపియన్‌, అమెరికన్‌ ఉద్గార ప్రమాణాలను 2016లోనే అందుకుంటూ సరికొత్త సీఆర్‌డీఐ సాంకేతికతను భారతదేశంలో మొట్టమొదటిసారిగా సోనాలికా పరిచయం చేసింది.

భారతదేశంలో సుప్రసిద్ధ ట్రాక్టర్ల తయారీ సంస్థలలో  ఒకటి కావడంతో పాటుగా  దేశం నుంచి నెంబర్‌ 1 ఎగుమతిదారునిగా గుర్తింపు పొందిన సోనాలికా ట్రాక్టర్స్‌,  ఈ టైగర్‌ సిరీస్‌ను యూరోప్‌లో డిజైన్‌ చేసింది. ఇది ఇప్పటికే అక్కడ రైతుల హృదయాలను గెలుచుకుంది. ఈ రెండు మోడల్స్‌ 4డబ్ల్యు, 2డబ్ల్యు డ్రైవ్‌  వెర్షన్స్‌లో లభ్యం కావడంతో పాటుగా 12+12 షటెల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌, 5జీ హైడ్రాలిక్‌ కంట్రోల్‌ వ్యవస్థను  కలిగి ఉంది. సీఆర్‌డీఎస్‌ ట్రాక్టర్లు లెజండరీ సోనాలికా శక్తి మరియు తెలివైన ఫీచర్లను సైతం కలిగి ఉన్నాయి.  ఇవి భావి తరపు వినియోగదారుల కోసం వ్యవసాయ యాంత్రికీకరణ వృద్ధికి సైతం తోడ్పడతాయి.

రైతు అభిప్రాయాలతోనే ఈ కొత్త డిజైన్

టైగర్‌ డీఐ75 మరియు డీ65 ట్రాక్టర్లు రెండూ కూడా స్కై స్మార్ట్‌ టెలిమాటిక్స్‌ కలిగి ఉన్నాయి. ఇది ఇంజిన్‌ ఇమ్మొబలైజర్‌, రియల్‌ టైమ్‌ సపోర్ట్‌, వాహన జియో ఫెన్సింగ్‌ వంటి ఫీచర్లను అందిస్తాయి. రైతులు అందించిన విలువైన అభిప్రాయాలపై ఆధారపడి సోనాలికా ఆర్‌ అండ్‌ డీ నిపుణులు ఈ సీఆర్‌డీఎస్‌ సాంకేతికతను అభివృద్ధి చేశారు.  ఇది 10% వరకూ  అధిక ఇంధన సామర్థ్యంను అందిస్తుంది.

రైతుల పట్ల కంపెనీ నిబద్ధతను సోనాలికా ట్రాక్టర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమణ్‌ మిట్టల్‌ వెల్లడిస్తూ ‘‘అవిశ్రాంతంగా కష్టపడే మన రైతులకు స్ఫూర్తినందిస్తూ  కిసాన్‌ దివస్‌ రోజున అత్యాధునిక టైగర్‌ డీఐ 75 4డబ్ల్యుడీ ట్రాక్టర్‌ను శక్తివంతమైన, ఇంధన సామర్థ్యం కలిగిన సీఆర్‌డీఎస్‌ సాంకేతికతతో విడుదల చేశాం.  సాంకేతికంగా అత్యాధునిక వ్యవస్థలు కలిగిన ఈ ట్రాక్టర్లు శక్తి, సామర్థ్యంల సమ్మేళనంలా వస్తాయి.

అందుబాటు ధరలలో రైతులను సమృద్ధి చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తీర్చిదిద్దిన ఈ ట్రాక్టర్లు అసాధారణ పనితీరును అందిస్తాయి. ఆ తాజా టైగర్‌ 75 4డబ్ల్యుడీ ట్రాక్టర్లలో  ట్రెమ్‌ 4 ఉద్గార ప్రమాణాలు ఉన్నాయి. ఈ విభాగాన్ని నిర్వచించే  అత్యధిక టార్క్‌, వేగం కలిగిన  టైగర్‌ డీఐ 75, టైగర్‌ డీఐ 65 ఆవిష్కరణ రైతుల కష్టం, వారి అభిరుచిని గౌరవిస్తూ సోనాలికా చేసే ప్రయత్నాలకు ప్రతీకగా నిలుస్తుంది.

సీఆర్‌డీఐ లాంటి సాంకేతికతలను అమెరికా, యూరోపియన్‌ ప్రమాణాలకనుగుణంగా పరిచయం చేసిన ఘనత సోనాలికాకు ఉంది. ఈ రెండు నూతన ట్రాక్టర్లూ రేపటి దిశగా రైతులను నడిపించడంలో  కీలక పాత్ర పోషిస్తాయి మరియు లీడింగ్‌ అగ్రి  ఎవల్యూషన్‌ కోసం సోనాలికా హెవీ డ్యూటీ ట్రాక్టర్‌ శ్రేణిని మరింత విస్తృతపరుస్తాయి’’ అని అన్నారు.

Related posts

బయన్న గట్టు భైరవ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే భీరం

Satyam NEWS

తెలంగాణ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రద్దు తగదు

Satyam NEWS

కాకతీయతో జల సిరిలొలుకుతున్న చెరువులు

Satyam NEWS

Leave a Comment