తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి చేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసిచాయని ఆయన వెల్లడించారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పునరుద్ధరించామని, దీంతో 14 లక్షల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. మిషన్ కాకతీయపై నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఓ డాక్యుమెంటరీని రూపొందించిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం లక్షా 17వేల 714 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఇంకా 31,668 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే పోస్టుల భర్తీకి సంబంధించి 900 కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు మానుకొని, ప్రజా సంక్షేమ పథకాలపై సలహాలు ,సూచనలు ఇవ్వాలని ఆయన చెప్పారు.
previous post