38.2 C
Hyderabad
April 29, 2024 11: 26 AM
Slider తూర్పుగోదావరి

హోంగార్డుల సంక్షేమంలో భాగంగా గుర్తింపు కార్డుల జారీ

#homeguards

హోంగార్డుల సంక్షేమంలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి M. రవీంద్రనాథ్ బాబు గుర్తింపు కార్డులను అందజేసారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 993 మంది హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్నారని, వీరంతా పోలీసు శాఖలో ఒక భాగమని, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర నివారణ, ట్రాఫిక్ నియంత్రణలో కానిస్టేబుల్ లతో సమానంగా హోంగార్డులు కష్టపడుతూ విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.

జిల్లాలోని హోంగార్డ్ లకు పోలీసులతో సమానంగా గుర్తింపునిచ్చేందుకు ఈ డిజిటల్ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, దీనిలో భాగంగా ఈ రోజు 30 మంది హోంగార్డులకు గుర్తింపు కార్డులు అందచేశామని తెలిపారు. మిగిలిన హోంగార్డులకు కూడా కొన్ని రోజుల వ్యవధిలో అందచేస్తామని, దీనికి గాను హోంగార్డ్  RI కి తగు ఆదేశాలు జారీచేశామని ఎస్ పి తెలిపారు.

Related posts

మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

Satyam NEWS

ప్రకాష్ రాజ్ ట్వీట్‌:చీపురుతో కొట్టారు షాక్‌ తగిలిందా?

Satyam NEWS

Leave a Comment