27.7 C
Hyderabad
April 26, 2024 05: 59 AM
Slider మహబూబ్ నగర్

బయన్న గట్టు భైరవ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే భీరం

#KollapurMLA

సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు చిన్నంబావి మండలం వెలగొండ గ్రామం బయన్న గట్టు భైరవ స్వామిని దర్శించుకుని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి పూజలు చేశారు.

కొల్లాపూర్ ప్రాంత ప్రజలపై భైరవ స్వామి కరుణ కటాక్షాలు ఎల్లపుడూ ఉండాలని, చల్లగా చూడాలని ఆ స్వామిని కోరుకున్ననని ఎమ్మెల్యే తెలిపారు.

భైరవ స్వామి దర్శనానికి వచ్చిన చిన్నారి సుష్మా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా చిన్నారి చేత ఎమ్మెల్యే కేక్ కట్ చేయించారు.

సుష్మాకు ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. స్వామి దర్శనానికి బయన్న గట్టు పైకి నడిచి వస్తున్న భక్తులను ఎమ్మెల్యే పలకరిస్తూ మకర సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు.

ఇంత వరకు బయన్న గట్టు భైరవ స్వామిని దర్శించుకోవడానికి ఏ ఎమ్మెల్యే కూడా రాలేదని, మొట్టమొదటి సారిగా మీరు వచ్చారంటు ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి కి తమ ఆనందాన్ని తెలుపుతూ భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Related posts

రాజ్యాంగ, ప్రజా, కార్మిక, ఉద్యోగ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

Satyam NEWS

కూల్చివేత వ్యర్థాలను వేసినందుకు ఆర్ఎస్ బ్రదర్స్ కు రూ 10 వేలు ఫైన్

Satyam NEWS

మోటారు మెకానిక్ లకు వివిసి మోటార్స్ బియ్యం పంపిణీ

Satyam NEWS

Leave a Comment