42.2 C
Hyderabad
April 30, 2024 15: 37 PM
Slider సినిమా

కరోనా పై గీతాలు ఆవిష్కరించిన ఆబ్కారీ మంత్రి

srikanth

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరించకుండా ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల నేడు పూర్తి నియంత్రణ లో ఉందన్నారు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ప్రజలందరూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా స్వీయ నియంత్రణ లో ఉండి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల తో ఇప్పటికే ఎన్నో అవగాహన గీతాలను రూపొందించి ప్రజలకు అందించామన్నారు.

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గీతాలను ప్రముఖ నటుడు శ్రీకాంత్ తో కలసి మంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు బాలాజీ దూసరి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా పై రూపొందించిన పాటలు చాలా బాగా ఉన్నాయన్నారు  దర్శకులు చాలా అద్భుతంగా తీశారన్నారు. దర్శకులు బాలాజీ దూసరిని,పాటల రచయితలు  కోదారి శ్రీను, అభి ఉప్పుల, ఎడిటర్ బాల ఇల్లందు లను మంత్రి అభినందించారు.

Related posts

రామ్ గోపాల్ వర్మ నుంచి మరో ‘ఆణిముత్యం’

Satyam NEWS

రిజైన్ స్కై బార్ పై ఎక్సయిజ్ పోలీసు పంజా

Satyam NEWS

టీడీపీ ఎంపీ రామ‌మోహ‌న్‌నాయుడు సంస‌ద్‌ర‌త్న

Satyam NEWS

Leave a Comment