కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం సాయంత్ర స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గత కొంత కాలంగా సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.గత సంవత్సర కాలంగా సోనియా గాంధీ అమెరికాలో ప్రత్యేక వైద్య చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడ గా ఉందని వైద్యులు తెలిపారు.
previous post