29.7 C
Hyderabad
May 7, 2024 06: 47 AM
Slider హైదరాబాద్

హూస్సేన్ సాగర్, గండిపేట, దుర్గం చెరువు అభివృద్ధి

ktr hmda

పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ఈరోజు హెచ్‌యండిఏ కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించారు. బుద్దభవన్ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో హెచ్‌యండిఏ చేపట్టిన కార్యక్రమాల పురోగతిని, ప్రణాళికలను చర్చించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న ప్రధాన సరస్సులైన హూస్సేన్ సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్దిపైన ఈ సమావేశంలో చర్చించారు. పలువురు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్లను ఈ సందర్భంగా పరిశీలించారు.

ముఖ్యంగా హూస్సేన్ సాగర్, గండిపేట చెరువుల అభివృద్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను కన్సల్టెంట్లు  వివరించారు. జలాశయాల సహజత్వాన్ని కాపాడుతూ, నగర ప్రజలకు అహ్లదం పంచేతీరుగా ఈ మాస్టర్ ప్లానింగ్ ఉండాలని ఈ సందర్భంగా మంత్రి సూచన చేశారు. గండిపేట వద్ద పార్కు కోసం హెచ్ యండిఏ తయారు చేసిన ప్రణాళికలకు అమోదం తెలిపిన మంత్రి, త్వరలోనే అక్కడ పనులు ప్రారంభించాలని అదేశించారు.

దీంతోపాటు గండిపేట జలాశయం చుట్టురా సూమారు 40 కీలోమీటర్ల మేర వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాకులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ప్రారంభించాలని, ఇందుకోసం జిల్లా యంత్రాంగం, నీటి పారుదల శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. హెచ్‌యండిఏ కోకాపేటలో అభివృద్ది చేయనున్న లేఅవుట్ పైన మంత్రి సమీక్ష చేశారు. ఇప్పటికే కోకాపేట, కొల్లూర్ లాంటి ప్రాంతాల్లో జన సాంద్రత పెరగడం, పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్న భవన సముదాయాలు, కార్యాలయాల నేపథ్యంలో అక్కడ విస్తరించాల్సిన రవాణా మౌళిక వసతుల కల్పనపైన చర్చించారు.

దీంతోపాటు హెచ్‌యండిఏ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే  హెచ్‌యండిఏతోపాటు ప్రయివేట్ సంస్ధలతో కలిసి పలు లాజిస్టిక్ పార్కులను అభివృద్ది చేస్తున్నదని, అయితే పెరుగుతున్న లాజిస్టిక్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, హెచ్‌యండిఏ స్వయంగా ఏర్పాటు చేసే పార్కులు, ప్రస్తుతం ఉన్న వాటి కన్నా పెద్దవై ఉండాలని, కనీసం 50 ఎకరాల పైన ఉండాలని సూచించారు. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటులో మల్టి మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుపైన దృష్టి సారించాలన్నారు.

హెచ్‌యండిఏ నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ హబిటాట్ సెంటర్ ప్రతిపాదనలపైన మంత్రి సమీక్షించారు. హైదరాబాద్ నగరంలోని కళలు, సంస్కృతికి అద్దంపట్టేలా, వాటిని ఊతం ఇచ్చేలా ఈ సెంటర్ ఉండాలని సూచించారు. దీంతోపాటు హైటెక్స్, హెచ్ ఐసిసి మాదిరి నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని హెచ్‌యండిఏ సూచించారు. ఉప్పల్, మేడ్చెల్ లాంటి సిటీ పరిసర ప్రాంతాలతోపాటు సెంట్రల్ సిటీ ప్రాంతాల్లోనూ ఈ కన్వేషన్ సెంటర్లను నిర్మించేందుకు అందుబాటులో ఉన్న ప్రాంతాల గుర్తింపుపైన అయా జిల్లాల యంత్రాంగాలతో చర్చించాలని అదేశించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

బిచ్కుంద లో బిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

Satyam NEWS

భగవంత్ కేసరి కి బ్రో ఫ్యాన్స్ మద్దతు…..

Satyam NEWS

ఏం అమ్మా..ఖ‌తార్ ఏర్ వేస్ బాగుందా…

Satyam NEWS

Leave a Comment