అమరావతి స్ఫూర్తి అందరిలో రావాలని, రాజధాని జిల్లా నుంచి తరలిపోతే తీరని అన్యాయం జరుగుతుందని నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ మాజీ శాసనసభ్యుడు ధూళి పాల నరేంద్ర, శ్రావణ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ 29 గ్రామాల లో రైతుల, మహిళల పోరాటం అభినందనీయమని అన్నారు.
ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు ఉద్యమానికి మద్దతు ఇచ్చాయని ఆయన అన్నారు. ఇది 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అమరావతిని ఇంచు కూడా ప్రభుత్వం కదిలించలేదని ఆయన అన్నారు. కోర్టు తీర్పు ఉన్న దొంగచాటుగా శాఖలు తరలింపు చేపట్టిన ప్రభుత్వాన్ని ఏమనాలని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికే వైసిపి నాయకులు పెడుతున్న ఇబ్బందులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, అక్రమ కేసులకు భయపడేది లేదు, అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.