40.2 C
Hyderabad
May 2, 2024 15: 32 PM
Slider జాతీయం

మరింత భద్రత కోసం త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు

#epassport

త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు రాబోతున్నాయి. ఇక నుంచి దేశ పౌరులు తీసుకోబోయే పాస్ పోర్టులలో రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID), బయోమెట్రిక్‌లను ఉపయోగిస్తారు. ఈ ఇ-పాస్‌పోర్ట్‌లలో ఇ-పాస్‌పోర్ట్‌లు పాస్‌పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత డేటా, పేరు, బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి.

వీటి కోసం పార్ పోర్టులో ఒక చిప్ ఉంటుంది. ఇ-పాస్‌పోర్ట్‌ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. పౌరుల సౌకర్యాన్ని పెంచడానికి ప్రభుత్వం 2022-23 నుండి ఇ-పాస్‌పోర్ట్‌లు విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ఇ-పాస్‌పోర్ట్‌లు వల్ల సమాచార భద్రత పెరుగుతుంది. అంతే కాకుండా అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చిప్‌లో ట్యాంపరింగ్ జరిగితే, సిస్టమ్ దానిని గుర్తించగలదని అలాంటి సందర్భంలో పాస్‌పోర్ట్ ను స్కానర్లు గుర్తించవు.

నాసిక్‌కు చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ పాస్‌పోర్ట్ జాకెట్‌ల కోసం ICAO-కంప్లైంట్ ఎలక్ట్రానిక్ చిప్ ఇన్‌లేస్ ఉత్పత్తికి కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంది. చిప్‌తో నడిచే ఈ-పాస్‌పోర్ట్‌ల జారీకి ఈ కాంటాక్ట్‌లెస్ ఇన్‌లేలు అవసరం. వీటి సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాస్‌పోర్ట్‌ల జారీ ప్రారంభమవుతుంది.

Related posts

వేముల వాడలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

Satyam NEWS

సామాజిక వ్యవస్థ పై అలుపెరుగని పోరాటం చేసిన భాగ్యరెడ్డి వర్మ

Satyam NEWS

ఆన్ లైన్ లో ద్వారకా తిరుమల స్వామి వారి కల్యాణం

Satyam NEWS

Leave a Comment