Slider నల్గొండ

ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా మోసం చేసింది

#cituc

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి,పేద ప్రజల, రైతులను,యువతని,వేతనంపై ఆధారపడిన వారిని మోసం చేసిందని, పెట్టు దారుల బడ్జెట్ అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ యల్క సోమయ్య గౌడ్ విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ బిల్డింగ్ కార్యాలయంలో ఉపతల వెంకన్న అధ్యక్షతన జరిగిన బిల్డింగ్ వర్కర్స్ సమావేశంలో రోషపతి, సోమయ్య గౌడ్ మాట్లాడుతూ దేశంలో  కరోనా సమయంలో నానాటికి పెరుగుతున్న పేదరికం,నిరుద్యోగులకు పనులు దొరకక దిగజారుతున్న బ్రతుకును ప్రభుత్వం ఆదుకోవాల్సిది పోయి అన్యాయం చేశారని,దేశంలో లాభాలు వచ్చే ఎల్ఐసి,రైల్వే,ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా అమ్మిన ఈ కేంద్ర బిజెపి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న,మండల అధ్యక్షుడు తమ్మిశెట్టి రాములు,షేక్ ముస్తాఫా, ఉప్పతల నరేష్,కొరివి గిరి,కృష్ణ,సైదులు, ప్రసాద్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కల్తీ కల్లు తాగి వికారాబాద్‌లో వంద మందికి అస్వస్థత

Satyam NEWS

డ్రోన్ బాంబ్:రక్తసిక్తమైన యెమెన్ 80 మంది మృతి

Satyam NEWS

ప్రాజెక్టులను ప్రీ క్లోజ్ చేస్తున్న జగన్ రెడ్డి

Bhavani

Leave a Comment