38.2 C
Hyderabad
April 29, 2024 22: 10 PM
Slider ప్రపంచం

విజిల్: సౌదీలో పర్మిట్ లేకుండా భారతీయుల బంగారం వ్యాపారం

Saudi-Arabia-gold-3

300 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు సౌదీ పోలీసులు. ఎందుకో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. జెడ్డా లో బంగారం నగలు తయారు చేసే కర్మాగారాలు, నగల అమ్మకం దుకాణాలు చాలా ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున బంగారు ఆభరణాల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇండియా నుంచి వెళ్లిన బంగారు ఆభరణాలు తయారు చేసే కార్మికలు ఈ కర్మాగారాలలో, దుకాణాలలో పని చేస్తూ ఉంటారు.

జెడ్డాలోని కందరాలో ఇండియాకు చెందిన ఏడుగురు ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నగల దుకాణం, కర్మాగారం నడుపుతున్నారు. చాలా కాలం నుంచి జరుగుతున్న ఈ వ్యాపారంపై అక్కడి అధికారులు ఒక కన్నేశారు. అక్కడ పని చేస్తున్న వారికి సరైన వర్క్ పర్మిట్లు ఉన్నాయా లేదా అని చెక్ చేశారు. అక్కడ పని చేసేవారికి ఎవరికి వర్క్ పర్మిట్లు లేవని తేలింది. అంతే కాకుండా ఆ దుకాణం ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నదని కూడా వెల్లడైంది.

దాంతో సౌదీ వాణిజ్య, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ అధికారులు అధికారులు విస్తృత తనిఖీలు జరిపి ఆ దుకాణం నుంచి 300 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను పరిశీలించడానికి నమూనాలను ప్రత్యేక ప్రయోగశాలలకు పంపారు. ఆ దుకాణం దారుడికి ఇంపోర్టు లైసెన్సు కూడా లేదని తేలింది. ఈ దుకాణం యజమానిని అక్కడ పని చేస్తున్న కార్మికులను ప్రాసిక్యూషన్ కు అప్పగించారు. కేసు విచారణలో ఉంది.

Related posts

ప్రయాణీకులు లేక మరో 8 రైళ్లు రద్దు

Satyam NEWS

NEET “కోటా” MCQ’s Booklets సిద్ధం

Satyam NEWS

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment