38.2 C
Hyderabad
April 29, 2024 19: 15 PM
Slider విజయనగరం

“స్పందన” ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలి…!

#spandana

ప్రతీ వారం మాదిరిగానే ఈ సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించే “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నిర్వహించారు. ఎస్పీ తో పాటు సెబ్ ఏఎస్పీ ,అలాగే విజయనగరం డీఎస్పీ లు కూడా ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకొన్న, ఎస్పీ దీపికా సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు లో మాట్లాడారు.

వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. జరిగిన “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 36 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జామి మండలంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు ప్రభుత్వం సర్వే నం.65/3లో 0.94 సెంట్ల భూమిని రొట్లపల్లి గ్రామంలో మంజూరు చేసినట్లు, కానీ అదే ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు సదరు భూమిని ఆక్రమించుకొనేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని జామి ఎస్ఐను ఆదేశించారు. విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ప్రక్కన నివసిస్తున్న ఇంటివారు పశువులను పెంచుతూ, వాటి వ్యర్థాలను సక్రమంగా శుభ్రం చేయకపోవడం వలన దుర్వాసన వస్తున్నదని, వాటి వలన చుట్టు ప్రక్కల నివసిస్తున్న వారు ఇబ్బందులకు గురవుతున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరమైన చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయ నగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు. ఒడిస్సా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్తతో వచ్చిన మనస్పర్థలు కారణంగా గత 2 ఏండ్లు గా నుండి భర్తతో వేరుగా ఉంటున్నట్లు, ఇటీవల కాలంలో తన భర్త మరణించగా, అతని బంధువులు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా క్రిమేషన్స్ చేసేసారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని చీపురుపల్లి డిఎస్పీని ఆదేశించారు.  డెంకాడ మండలంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త మరియు పిల్లలు మరణించడం తో తాను ఒంటరిగా నివసిస్తున్నట్లు, తన మామ, భర్త మరణానంతరం వారసత్వంగా సంక్రమించిన భూమిని, ఆమె ఆడపడుచు మరియు ఇతర బంధువులు సదరు భూమిని ఆక్రమించుకొనే క్రమంలో పంటను బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయినట్లు, తనపై దౌర్జన్యంకు పాల్పడుతున్నట్లు, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని డెంకాడ ఎస్ఐను ఆదేశించారు.  విజయనగరం మండలం వీటీ అగ్రహారంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తికి  2 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు, సదరు వ్యక్తి అప్పు తీర్చడం లేదని, వడ్డీ కూడా చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐను ఆదేశించారు.ఎస్.కోట మండలం ముసిడిపల్లి కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తన పిల్లల బాగోగులు చూడడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దిశ డిఎస్పీని ఆదేశించారు.

“స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి ఏడు రోజుల లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నేరుగా నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీసీఆర్బీ సీఐ జె. మురళి, డీసీఆర్బీ ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రభాస్ సినిమాకు జగన్ ప్రభుత్వం వెసులుబాటు

Satyam NEWS

ఒపీనియన్: చట్టప్రకారం షోకాజ్ నోటీసు చెల్లేది కాదు

Satyam NEWS

మానియాక్: తల్లి వయసు ఆంటీతో భార్య ఎదుటే సరసాలు

Satyam NEWS

Leave a Comment