26.7 C
Hyderabad
May 3, 2024 08: 49 AM
Slider గుంటూరు

పల్నాడు జిల్లా పోలీస్ స్పందనలో ఫిర్యాదుల వెల్లువ

#palanadupolice

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన స్పందన కార్యక్రమం లో 26 ఫిర్యాదులు అందాయి. వాటిని తక్షణమే పరిష్కరించమని సంబంధిత అధికారులకు ఆదేశించామని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. నేటి కార్యక్రమంలో రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు తమ పేరు మీద ఉన్న పొలాన్ని తన కన్నకొడుకు పేరు మీద రాయనందుకు ఇంటినుండి బయటకి గెంటివేసాడని ఎస్పీకి విన్నవించుకోగా,సదరు ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.

బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇల్లాలిని అదనపు కట్నం కోసం భర్త,అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారని,ఇంటి నుండి బయటకు గెంటివేశారని, న్యాయం చేయమని ఎస్పీని అశ్రయించగా,ఈ ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించి ఇల్లాలికి తగిన న్యాయం చేయమని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అవసరానికి అప్పు తీసుకుని,తిరిగి చెల్లించమంటే చెల్లించకుండా బెదిరిస్తున్నారని వినుకొండ పట్టణానికి చెందిన బాధితుడు ఫిర్యాదు చేయగా తగిన న్యాయం చేయమని, సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందు మాధవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

పోలీసుల ప్రేక్షకపాత్ర: తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Satyam NEWS

బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

బైంస అల్లర్ల బాధితులకు మంత్రాలయ పీఠం బాసట

Satyam NEWS

Leave a Comment