29.7 C
Hyderabad
May 2, 2024 06: 39 AM
Slider పశ్చిమగోదావరి

పోలీసుల ప్రేక్షకపాత్ర: తల్లీకూతుళ్ల ఆత్మహత్య

#kidnap

ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడ గ్రామంలో ఘోరం జరిగిపోయింది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంతో రెండు నిండు ప్రాణాలు పోయాయి. గోపన్నపాలెం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు 15 ఏళ్ళ బాలికను (మైనర్) ప్రేమ పేరుతో మోటార్ బైక్ పై కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాలిక తల్లి పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

పోలీసులు కేసు నమోదు చేసి తన కుమార్తెను వెతికితీసుకువస్తారని ఆమె భావించారు. అయితే పోలీసులు అలా చేయలేదు. తీరిగ్గా వేచి చూసి ఆ యువకుడిని రప్పించి ఆ బాలికను తల్లి వద్దకు పంపారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిపై కేసుపెట్టకపోవడం ఆ తల్లిని తీవ్రంగా బాధించింది.

తన కుమార్తెను అప్పగించినంత మాత్రాన సరిపోదని, మోసం చేసి కిడ్నాప్ చేసిన వాడికి శిక్ష పడాలని ఆ తల్లి కోరుకున్నది. అయితే పోలీసులు అలా చేయకపోవడంతో ఈ పోలీసులు తనకు, తన కుమార్తెకు న్యాయం చేయరనే నిర్ణయానికి వారు వచ్చేశారు. జరిగిన అవమానం తట్టుకోలేక తల్లికూతుళ్ళు డ్రింక్ బాటిల్ లో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పరిస్థితి గమనించిన గ్రామస్తులు తల్లి కూతుళ్ళను చికిత్సకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం ఆందోళనకరం గా ఉండడం తో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తలించగా అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం గల్లా అనిత (15 ) శనివారం గల్లా దేవి ( 45 ) తుది శ్వాస విడిచారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డ పోలీసులందరిని ఉద్యోగాల నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. ఇదే డిమాండ్ తో ఎం ఆర్ పి ఎస్ నాయకులు ఎగువాడ రహదారిని మూసివేసి ధర్నా చేశారు. బాధ్యులైన ఎస్ ఐ ని, సంబంధం ఉన్నపోలీసుల్ని సస్పెండ్ చెయ్యాలని ఎం ఆర్ పి ఎస్ నాయకులు కందుల రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి మురళి నంది పాము శ్రీను మండల ప్రధాన కార్యదర్శి బొక్కినాల రాజేష్ కొత్తపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ డిమాండ్ తో శాంతిభద్రతల సమస్య తలెత్తతుందని భావించిన ఏలూరు రేంజ్ డీఐజీ పాల రాజు పెదవేగి ఎస్సై సత్యనారాయణ ను సస్పెండ్ చేశారు. అయితే వేగివాడ సంఘటనలో మరో అధికారి పాత్రకూడా ఉంది. అతడి వత్తిడి మేరకే కేసు నమోదు చేయలేదని అంటున్నారు. తెరవెనుక ఉన్న ఆ అధికారి తప్పించుకున్నాడు.

Related posts

హేపీ బర్త్ డే: బాలయ్య పేరిట సేవా కార్యక్రమాలు

Satyam NEWS

కడప జిల్లాలో కోవిడ్ తో సబ్ పోస్ట్ మాస్టారు మృతి

Satyam NEWS

మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా బిజెపి ఆందోళన

Satyam NEWS

Leave a Comment