29.2 C
Hyderabad
May 9, 2024 23: 35 PM
Slider విజయనగరం

పోలీసు గ్రీవిన్స్ సెల్ లో ఈ సారి 43 ఫిర్యాదులు..!

#spandana

ఏపీ రాష్ట్ర పోలీసు శాఖ ఎట్టకేలకు… విజయనగరం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలకు డీఎస్పీ లను నియమించింది. డీజీపీ ఉత్తర్వుల మేరకు విజయనగరం డీఎస్పీ గా గోవింద రావు ,ట్రాఫిక్ డీఎస్పీ గా విశ్వనాధ్ లు బాధ్యతలు చేపట్టి.. రమారమి మూడు నెలలు కూడా అయ్యింది. ప్రతీ సోమవారం మాదిరిగానే జిల్లా పోలీసు బాస్… డీపీఓలో నిర్వహించిన “స్పందన”లో…ఈ వారం ఏకంగా 43 మంది బాధితులు తమ ,తమ సమస్యలను చెప్పుకున్నారు.

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 43 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. భోగాపురం మండలం పోలిపల్లి కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు బడుకొండపేట కి చెందిన వ్యక్తులతో భూమి విషయమై కోర్టులో కేసులున్నాయని, ఇటీవల క్రింది కోర్టు తనకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో, హైకోర్టును ఆశ్రయించినట్లు, నిందితులు ఫారెస్టు అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా సరుగుడు తోటను నరికేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ సీఐను ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి చేస్తూ తాను ఆన్లైను గోల్డ్ ట్రేడింగు ద్వారా 33.55 లక్షలు పెట్టుబడి పెట్టి, మోసపోయానని, వారిపై చర్యలు చేపట్టి, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని విజయనగరం టూటౌన్ సీఐను ఆదేశించారు.

బొబ్బిలి మండలం కోరాడ కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయవాడకు చెందిన ఒక వ్యక్తి మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం కల్పిస్తానని నమ్మించి, తన వద్ద నుండి 4.30 లక్షలు తీసుకొని, మోసగించారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి డీఎస్పీని ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త తనను అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయ నగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన వద్ద నుండి  43 వేలు తీసుకొని, ఇనుప బద్దీలతో షాపు తయారు చేసి, ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, కానీ, సదరు వెల్డింగు షాపు వ్యక్తి ఇంత వరకు షాపు తయారు చేయలేదని, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

ఇలా “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాధ్, డిసిఆర్బీ సీఐ జె. మురళి, ఎస్బీ సిఐలు కె.కె.వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, జి.రాంబాబు, డీసీఆర్బీ ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఫేక్ సర్టిఫికెట్ ల ముఠా గుట్టురట్టు

Bhavani

డాడీ హెల్పింగ్ ఫౌండేషన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఉదారత్వం

Satyam NEWS

రిజర్వేషన్ కల్పించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం

Satyam NEWS

Leave a Comment