27.7 C
Hyderabad
May 15, 2024 04: 58 AM
Slider విజయనగరం

పోలీసు “స్పందన” కు ఎంతమంది బాధితులు ఫిర్యాదు ఇచ్చారో తెలుసా…!

#spandana

ఈ వారం విజయనగరం జిల్లా డీపీఓలో జరిగే “స్పందన” లో 28 బాధితులు.. తమ, తమ సమస్యలను పరిష్కరించారని పోలీసు బాస్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీగారు 28 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే విజయనగరం మండలం పినవేమలి కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ భూమి విషయమై తన గ్రామానికి చెందిన వ్యక్తితో ఈ నెల 6న గొడవ జరిగినట్లు, తనకు తలకు గాయమై, ఆసుపత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జ్ అవ్వగా, మళ్ళీ సదరు వ్యక్తి తనను బెదిరిస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐను ఆదేశించారు.

బొండపల్లి మండలం కొత్త పనసలపాడు గ్రామానికి చెందిన వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ బ్రతుకు తెరువు కోసం తాను షిఫ్ట్ డిజైర్ కారును కొనుగోలు చేసి, విశాఖపట్నంకు శ్రీకాంత్ నగర్ కు చెందిన వ్యక్తికి నెలకు 20వేలు చెల్లించేందుకు అగ్రిమెంటు కుదుర్చుకున్నట్లు, సదరు వ్యక్తి తన కారుకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం లేదని, కారును కూడా తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం సిఐను ఆదేశించారు.

బొబ్బిలి  కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తనను సక్రమంగా చూడడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఇరు కుటుంబాలకు కౌన్సిలింగు చేయాలని, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం ఎస్ఐను ఆదేశించారు.

డెంకాడ మండలం మోదవలస  కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త అదనపు కట్నం కోసం వేధించిన కారణంగా ఇంటి నుండి వెళ్ళిపోయినట్లు, కొంతకాలం హైదరాబాద్లో ఉన్నట్లు, తిరిగి ఇంటికి రాగా తన భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిసిందని, తన పిల్లలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, కౌన్సిలింగు ఇవ్వాలని, న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సహాయ కేంద్రాన్ని ఆశ్రయించే విధంగా చర్యలు చేపట్టాలని దిశ మహిళా పిఎస్ సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు, తన అనుమతి లేకుండా తన కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయినట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సిఐను ఆదేశించారు.

పూసపాటిరేగ మండలం కుమిలి  కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తి తన నివాస స్థలంలో ఇంటి నిర్మాణానికి ఉపక్రమించినట్లు, ఈ విషయమై వారిని ప్రశ్నించగా, బెదిరింపులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని పూసపాటిరేగ ఎస్ఐను ఆదేశించారు.

“స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్బీ సిఐ జె. మురళి, ఎస్బీ సిఐలు జి. రాంబాబు, ఈ. నర్సింహమూర్తి, డిసిఆర్బీ ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతిలు ఉన్నారు.

Related posts

తెలంగాణ రైతుల భీమా కోసం రూ.1450 కోట్లు చెల్లింపు

Satyam NEWS

ఎన్టీవీ ఎడిటర్ సుందరరామ శాస్త్రి పై మరో ఫిర్యాదు

Satyam NEWS

సైరా వంశస్తులను అవమానించిన నిర్మాతలు

Satyam NEWS

Leave a Comment