42.2 C
Hyderabad
May 3, 2024 16: 44 PM
Slider విజయనగరం

ఈ వారం పోలీసు”స్పందన”కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా…?

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక, “స్పందన” కార్యక్రమాన్ని  నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 38 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

మధురవాడకు చెందిన వ్యక్తి మరియు నెల్లిమర్ల గ్రామానికి చెందిన మరో వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తమకు పూసపాటిరేగ మండలం వెల్లూరు గ్రామంలో 20సెంట్లు భూమి విషయమై తరుచూ తగువులు పడుతున్నట్లు, తమ సమస్యకు పరిష్కారం చూపి, న్యాయం చేయాలని ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదిదారులకు న్యాయం చేయాలని భోగాపురం సిఐను ఆదేశించారు.

బొండపల్లి మండలం చినతామరాపల్లి  కి చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను గ్రామంలో ఒంటరిగా ఉంటున్నట్లు, అదే కి చెందిన కొంతమంది వ్యక్తులు తనపై అకారణంగా దౌర్జన్యంతో దాడులకు పాల్పడుతున్నారని, వారి నుండి తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం సిఐను ఆదేశించారు.

విజయనగరం దాసన్నపేటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన వదిన ప్రస్తుతం కేన్సర్తో బాధపడుతున్నారని, తన ప్రాంతంలోనే నివాసరం ఉంటున్న ఒక వ్యక్తికి చేబదులుగా 4 లక్షలు ఇచ్చినట్లు, సదరు వ్యక్తి చేబదులుగా తీసుకున్న నగదును, వడ్డీని ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐను ఆదేశించారు.

నెల్లిమర్ల మండలం బొప్పడాం గ్రామానికి చెందిన ఒక మహిళా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన బంధువు లైన కొంమంది వ్యక్తులు తన సంతకాలను ఫోర్జరీ చేసి, తప్పుడు ప్రాంశరీ నోట్లును సృష్టించి, తనను డబ్బులు చెల్లించమని బెదిరిస్తున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని నెల్లిమర్ల ఎస్ఐను ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ బొండపల్లి మండలం మరువాడ కి చెందిన ఒక వ్యక్తి ఎలక్ట్రికల్ డిపార్టుమెంటులో వివిధ ఉద్యోగాలు కల్పిస్తానని, తమను నమ్మించి, తమ వద్ద నుండి 6.40 లక్షలు తీసుకున్నట్లు, మూడు సం.లు నుండి తమను త్రిప్పుచున్నాడని, డబ్బులను తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొండపల్లి ఎస్ఐను ఆదేశించారు.

గుర్ల మండలం కెల్ల కి చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తన కుమారుడు ఆస్తిని తన పేరున వ్రాయాలని వేధింపులకు పాల్పడుతున్నాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని చీపురుపల్లి సీఐను ఆదేశించారు.

స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను, వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బి సీఐ జె. మురళి, ఎస్బీ సీఐ జి. రాంబాబు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి

Satyam NEWS

నీళ్లెక్కడ నియామకాలెక్కడ కేసీఆరూ

Satyam NEWS

టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం

Satyam NEWS

Leave a Comment