38.2 C
Hyderabad
April 29, 2024 12: 11 PM
Slider గుంటూరు

సమాజం సంఘటితంగా ఉంటేనే దేశం పటిష్టం

#palanadupolice

భారతదేశ మొదటి ఉప ప్రధాని, దేశ మొదటి హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నరసరావుపేట పట్టణంలో రాష్ట్రీయ ఐక్యత దినోత్సవం(రాష్ట్రీయ ఏక్తా దివస్)ను ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ఐక్యత కోసం పరుగు(Run for Unity) కార్యక్రమాన్ని పట్టణంలోని స్థానిక మల్లమ్మ సెంటర్ నందు పల్నాడు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్యాంప్రసాద్ తో కలసి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రారంభించారు.

పోలీస్ బ్యాండ్ వారి శృంగ ధ్వనులతో మల్లమ్మ సెంటర్ నుండి పల్నాడు బస్టాండ్ వరకు సాగిన ఈ ఐక్యత కోసం పరుగు(Run for Unity) లో పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు,పుర ప్రముఖులు,విద్యార్థిని – విద్యార్థులు,ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పీ, కలెక్టర్, అదనపు ఎస్పీ G. బిందుమాధవ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన జాతి నిర్మాణానికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తులలో వల్లభాయ్ పటేల్ ఒకరు. మన దేశం ఇంత ఉన్నతంగా,ఐక్యంగా ఉందంటే అది కేవలం వల్లభాయ్ పటేల్ కృషి ఫలితమే. ఈ రోజు మనం ఒక దేశంగా ఐక్యంగా ఉంటూ ముందుకెళ్తున్నామంటే అది కేవలం వల్లభాయ్ పటేల్ కృషి వల్లనే సాధ్యం అయిందని అన్నారు. భారత దేశ స్వాతంత్ర్యానంతరం దేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినప్పుడు వల్లభాయ్ పటేల్ నాయకత్వంలోని అప్పటి మన నాయకులు అందరూ ఎంతో కృషి చేసి సమస్యాత్మకంగా ఉన్న అన్ని రాజ్యాలను ఒకటిగా విలీనం చేసి,ఏకైక దేశముగా రూపుదిద్దారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇతర నాయకులు చేసిన విలువైన త్యాగాలను స్మరించుకోవడానికి ఇది మంచి తరుణం. దేశ ఐక్యత దినముగా చెప్పుకునే ఈ రోజును నిర్ధారించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది అని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మనం సంఘటితంగా ఒక దేశముగా ప్రశాంతముగా ఉంటున్నామంటే అది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకుల త్యాగ ఫలితమే అని అందరూ గుర్తించాలని అన్నారు. దేశ ఐక్యత మరియు సమగ్రత కొరకు ప్రతి ఒక్కరు తమని తాము సమర్పించుకుని కష్టపడి పనిచేయాలి. ఐక్యత అనేది మన మనుగడకు,దేశాభివృద్ధికి ఎంతో ప్రాముఖ్యమైనది. మన దేశాన్ని విడగొట్టడానికి, అలజడులు సృష్టించడానికి ప్రయత్నించే సంఘ విద్రోహశక్తులను అణచివేస్తూ,అవి చేసే దుష్ట ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ దేశ ఐక్యతను మరియు సమగ్రతను కాపాడటానికి అందరూ కృషిచేయాలి అని అన్నారు.

తదనతరం అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందు మాధవ్ కార్యక్రమానికి హాజరైన అధికారులు, పోలీసులు,విద్యార్థిని  విద్యార్థుల చేత దేశ ఐక్యత దినోత్సవ(Rastra Ektha Diwas) ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) రామచంద్రరాజు, ఏఆర్ డిఎస్పీ చిన్నికృష్ణ, సీఐలు, ఆరైలు, పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

మూడు నెలల్లో బైరెడ్డి పేట చోరీ కేసు నిందితుడు పట్టివేత..!

Satyam NEWS

కరోనా నుంచి కోలుకున్న సినీ నటి జెనీలియా

Satyam NEWS

తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

Bhavani

Leave a Comment