36.2 C
Hyderabad
May 14, 2024 18: 29 PM
Slider ముఖ్యంశాలు

నీళ్లెక్కడ నియామకాలెక్కడ కేసీఆరూ

#MalluBhatti

ఉద్యమంతా నీళ్ల కోసం నియామకాల కోసం అన్న ఉద్యమకారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. ఉద్యోగాల కోసమే ఉద్యమంలోకి వచ్చాను.. నేనే పెద్ద ఉద్యకారుడిని అని చెప్పుకునే వైద్య మంత్రి రాజేంద్రా.. తెలంగాణ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పగలవా..

ఇతర శాఖల సంగతి దేవుడేరుగు కనీసం నీ వైద్య శాఖలో ఉన్న ఖాలీలను అయినా నువ్వు భర్తీ చెసినవా.. నిమాయకాల కోసమే ఉద్యమం అన్నావు కదా రాజేంద్ర.. ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఎందుకు నియామకాలు చేపట్టలేదో ప్రజలకు విజవరించు..నియామకాలు చేపట్టు.. లేకపోతే.. జాతికి క్షమాపణ చెప్పి..మంత్రి పదకివికి రాజీనామా చేయి..అని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు.

కోవిడ్-19 నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను సీఎల్పీ బృందం భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, నెట్టెంపాడు ప్రాజెక్టులకింద మొత్తం 22 లక్షల 69 వేల ఎకరాలు సాగులో ఉన్నాయి.

నాగార్జున సాగర్ ఎడం కాలువ కింద దశాబ్దాలుగా 6 లక్షల 40 వేల ఎకరాలు మొత్తంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో29 లక్షల ఎకరాల సాగులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 203 కింద నిర్మించటలపెట్టిన సంగమేశ్వర రాయలసీమ లిఫ్ట్ తో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోంది.

రాయలసీమ లిఫ్ట్ తో 3 టీఎంసీల, పోతిరెడ్డిపాడు ద్వారా 8 టీఎంసీలు మొత్తంగా రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులో 814 అడుగుల ఎత్తులో నీటిని రోజు 11 టీఎంసీల చొప్పున తరలిస్తే.. నెల రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది..

ఈ నేపథ్యంలో ఎగువన ఉన్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి లిఫ్ట్ కు ఎప్పుడు నీళ్లు వస్తాయి.. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ఎప్పుడు వస్తాయి.. అవి ఎప్పుడు నిండుతాయి.. అని భట్టి అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు అన్ని మన కళ్ళముందే ఎండిపోయే  ప్రమాదం ముంచుకొస్తుంటే కావాలనే.. ఎపిక్స్ కమిటీ సమావేశానికి కేసీఆర్ కావాలనే హాజరు కాలేదు.

తన రాజకీయాలు, ఆర్థిక అవసరాల కోసం తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేస్తున్నారు. ఇదెక్కడి ఉద్యమ పోరాటం.. ఇదెక్కడి ఆరాటం చంద్రశేఖరా… అని భట్టి ప్రశించారు. కృష్ణ జలాల పరిరక్షణ కోసం కృష్ణ నదీ పరివాహక ప్రాంత నాయకులు అందరిని, అన్ని పార్టీలవారిని కలువుకు ముందుకు వెళతానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. 

ఇదే శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు తాగునీరు వస్తుంది.. రేపు హైదరాబాద్ వాసుల మంచినీటి పరిస్థితి ఏమిటి చంద్రశేఖరా.. అని భట్టి వికమార్క మల్లు ప్రశ్నించారు. దక్షిణ  తెలంగాణ ఎడారిగా మరవద్దు అనుకునే టీఆర్ఎస్ నాయకులు.. కేసీఆర్ ను ఎదిరించి బయటకు రావాలని భట్టి విక్రమార్క మల్లు పిలుపు ఇచ్చారు.

Related posts

మత్స్య కార్మిక కుటుంబాల స్వావలంబన కోసం ముఖ్యమంత్రి తపన

Satyam NEWS

కరోనా వైరస్ మ్యుటేషన్ కు సంబంధించి ఇది శుభవార్త

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ

Satyam NEWS

Leave a Comment