28.7 C
Hyderabad
April 27, 2024 05: 20 AM
Slider చిత్తూరు

టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం

#TTD

క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన కిర‌ణ్ నాయుడు అనే వ్యక్తి టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదే ప్రాంతానికి చెందిన ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనే వ్యక్తి మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో Cr.No. 220/2020, U/S 420 R/W  511 IPC ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదేవిధముగా టిటిడి నందు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది ద‌ళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసిన సందర్బాలు ఉన్నాయి.

అటువంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. టిటిడిలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టేప్పు‌డు ముందుగా ప‌త్రిక‌ల్లో, టిటిడి వెబ్‌సైట్‌లో అధికారిక ప్ర‌క‌ట‌న (నోటిఫికేషన్ ‌) ఇస్తారు. ఎవరైన డబ్బులు తీసుకొని  ఉద్యోగాలు ఇప్పించడం పూర్తిగా అసాధ్యం.

ఇటువంటి విషయలపై  టిటిడి గతంలో కూడా ప్రజలకు స్పష్ట‌గా వివరణ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తముగా  ఉండి ఇటువంటి  దళారుల మాటలు విని, మోసపోకుండా ఉండాలని టిటిడి కోరుతుంది. 

Related posts

నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ తెలియజేయాలి

Satyam NEWS

ఉద్యోగాలు అడిగిన జనసేన నేతల అరెస్ట్…

Satyam NEWS

తిట్టినా ఉలకని పలకని తెలంగాణ సిఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment