37.2 C
Hyderabad
May 2, 2024 13: 02 PM
Slider విజయనగరం

బాపురే….స్పంద‌న‌కు వ‌చ్చిన ఫిర్యాదులు ఎన్నో తెలుసా..?

#spandana

వారం రోజుల్లో ఫలితం చూపించాల‌న్న విజయనగరం పోలీస్ బాస్ దీపిక

ప్ర‌తీ వారం విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ నిర్వహించే దానికంటే ఈసారి స్పంద‌న‌కు..అత్య‌ధికంగా 49 మంది బాధితులు త‌మ‌, త‌మ సమ‌స్య‌ల‌ను ఫిర్యాదుల రూపంలో  ఎస్పీ ఆఫీసుకువ‌చ్చి విన్న‌వించుకోవడం విశేషం. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలోన్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

విజయనగరం వి.టి.అగ్రహారంకు చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు చెందిన మరుగు దొడ్డిని దగ్గర్లోనే నివాసం ఉంటున్న ఒక కుటుంబం పడగొట్టడానికి ప్రయత్నించగా, అడ్డుకున్నందుకు ఆమెపై దాడి చేసినట్లు, తనకి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐని ఆదేశించారు.

విజయనగరం రౌతువీధికి చెందిన కొంతమంది జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రౌతువీధి మేకల కమేళా పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, పోలీసు గస్తీ కోరగా, ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విజయనగరం వ‌న్ టౌన్ ఇన్స్పెక్టర్ ను చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అంబేద్కర్ విగ్రహానికి అపచారం పై స్పందించండి

వల్లంపూడికి చెందిన ఓ బాదిథుడు జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ ఈ నెల 8వ తేదిన గ్రామంలో గల గౌతమ బుద్ధుడు మరియు అంబేద్కర్ విగ్రహాలను ఒక లారీ గుద్ది వేయడంతో, సదరు లారీ యజమానిని సంప్రదించ గా విగ్రహాలకు మరమ్మత్తులు చేయిస్తానని చెప్పి ఇంతవరకూ చేయించలేదని న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ వల్లంపూడి ఎస్ఐని తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జామి మండలంకు చెందిన ఓ బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభించుటకు గాను తన వద్ద నుండి కొంత డబ్బులు అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో తగు చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని జామి ఎస్ఐని ఆదేశించారు.

నెల్లిమర్లకు చెందిన ఓ ఫిర్యాదు దారుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ త‌మ  గ్రామంలో సర్వే నెంబరు 53 లోగల 2.44 ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమించినట్లు, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని నెల్లిమర్ల ఎస్ఐని ఆదేశించారు.

బొండపల్లి మండలం బిల్లలవలసకి ఓ బాధితుడు జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తనకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమికి వెళ్ళకుండా అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ముళ్ళ కంచెను అడ్డుగా వేసి, తమ భూమిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొండపల్లి ఎస్ఐను ఆదేశించారు.

ఇలా “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, వారం రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ . దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దిశ డిఎస్పీ టి. త్రినాధ్,డీసీఆర్బి సీఐ డాబి.వెంకటరావు, ఎస్బీ సీఐ సి.హెచ్. రుద్రశేఖర్, ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

స్పందనలో అందిన 27 ఫిర్యాదులు… అధికంగా ఆస్తి  త‌గ‌దాల కేసులే

Satyam NEWS

ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో అడుగు పెట్టిన స‌త్యం న్యూస్.నెట్

Satyam NEWS

Thanks: చీఫ్ జస్టిస్ రమణ చొరవతో పెరిగిన జడ్జిల సంఖ్య

Satyam NEWS

Leave a Comment