36.2 C
Hyderabad
April 27, 2024 22: 23 PM
Slider విజయనగరం

స్పందనలో అందిన 27 ఫిర్యాదులు… అధికంగా ఆస్తి  త‌గ‌దాల కేసులే

#spandana

తక్షణమే చర్యలు చేపట్టాలి: విజయనగరం జిల్లా పోలీస్  బాస్ దీపిక  ఆదేశాలు

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ప్ర‌తీ సోమవారం మాదిరిగానే ఈ వారం కూడా “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపిక‌ నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ…  27 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

విజయనగరం మండలం, సుంకరిపేటకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ బొండపల్లి మండలం, అంబటివలస  కి చెందిన ఒక వ్యక్తికి తన లగేజి ట్రక్కును ఫైనాన్స్ పై ఇచ్చినట్లు, సదరు వ్యక్తి ఫైనాన్స్ కట్టకుండా తన బండిని తనకు తిరిగి ఇవ్వడంలేదని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ సిఐని ఆదేశించారు.

పార్వతీపురం, కొత్తవలసకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేస్తూ విజయనగర పరిధిలో తన భార్యపేరున ఒక ఇంటిస్థలం ఉన్నట్లు, సదరు స్థలంకు తూర్పున స్థలం ఉన్న వ్యక్తులు సదరు స్థలంను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, సదరు వ్యక్తులుపై చర్యలు తీసుకొని, తనకి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సిఐని ఆదేశించారు.

అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు

నెల్లిమర్ల మండలం, నువ్వానిపేట కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయనగరంకు చెందిన వ్యక్తికి కొంత డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు సదరు వ్యక్తి తన డబ్బులు తిరిగి ఇవ్వడంలేదని, తన డబ్బులు తిరిగి ఇప్పించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వ‌న్ టౌన్ సీఐని ఆదేశించారు.

పార్వతీపురం, బెలగాం వీధికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదుచేస్తూ తనకు బొబ్బిలి పట్టణం, వెలమవారి వీధిలో 2 స్లాబు ఇల్లు ఉన్నట్లు, అందులో ఒక ఇంటిని ఒకామె వద్దనుండి కొంత డబ్బులు తీసుకొని 3 సం||లు తను నివసించే నిమిత్తం ఒప్పందం చేసుకొన్నానని, ప్రస్తుతం గడువు ముగిసిన తర్వాత తన డబ్బులు తీసుకొని, తన ఇంటిని ఖాళీ చేయమంటే, ఖాళీ చేయకుండా తనను బెదిరిస్తున్నట్లు, తన ఇంటిని ఖాళీ చేయించి, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదిపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి టౌన్ సీ ఐని అదేశించారు.

గజపతినగరం మండలం, రంగుపురంకి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేస్తూ తనకుతమ గ్రామంలో కొంత డిపట్టా భూమి ఉన్నట్లు, అదే గ్రామానికి చెందిన వ్యక్తులు తమ భూమిలోనికి అక్రమంగా ప్రవేశించి సాగుకు ఆటంకం కలిగిస్తున్నారని, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం ఎస్ఐని ఆదేశించారు. ఇలా ఈ విధంగా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి,  ఏడురోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ .దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, డీసీఆర్బి సీఐ డాబి.వెంకటరావు, ఎస్బీ సీఐ సి. హెచ్. రుద్రశేఖర్, ఎస్ఐలు వాసుదేవ్, ముకుందరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

కోనసీమ సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి మురుగన్ హామీ

Satyam NEWS

పెరిగిన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ రేట్ల కు మహిళల నిరసన హోరు

Satyam NEWS

దారుణం: డబ్బు కట్టకపోతే వెంటిలేటర్ తీసేస్తాం

Satyam NEWS

Leave a Comment