38.2 C
Hyderabad
May 5, 2024 22: 38 PM
Slider ముఖ్యంశాలు

గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు

#Arunachal Giri

అరుణాచల గిరి ప్రదర్శనకు టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడపనున్నది. జులై 3న గురు పౌర్ణమి సందర్బంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి బయలు దేరి, ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.

గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జులై 3 సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తుంది. అక్కడ దర్శనానంతరం హైదరాబాద్ కు మరుసటి రోజు జులై 4 ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా టీఎస్ఆర్టీసీ అందిస్తోంది.

ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణయించింది.గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనా ర్, సూచించారు

Related posts

పబ్లిక్ సర్వీస్ ప్రశ్నాపత్రాల లీకేజీ పై ఆర్ డి ఓ కార్యాలయం ఎదుట ధర్నా

Satyam NEWS

భారత భాగ్యవిధాతలారా….

Satyam NEWS

స్వామి కళ్యాణనికి అన్ని ఏర్పాట్లు

Murali Krishna

Leave a Comment