26.7 C
Hyderabad
May 3, 2024 09: 18 AM
Slider కర్నూలు

అక్రమ మద్యంపై కర్నూలు జిల్లా పోలీస్ వార్

#KurnoolPolice

కర్నూలు జిల్లా పోలీసు  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో (SEB) ఆధ్వర్యంలో అక్రమ మద్యం, ఇసుక దందాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి పర్యవేక్షణలో అక్రమ ఇసుక  రవాణా, అక్రమ మద్యం, నాటు సారా కట్టడి కి జిల్లాలో SEB టీం, పోలీసు, ఎక్సైజ్ పోలీసుల సమన్వయంతో  దాడులు కొనసాగుతున్నాయి.

అక్రమ మద్యం, నాటు సారా పై 40  కేసులు నమోదు చేశారు. మొత్తం 43 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 13 వావాహనాలు సీజ్ చేశారు. ఈ కేసులకు సంబంధించి 275  లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని  5,070 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు.

వివిధ బ్రాండ్లకు చెందిన 3,105 ( 359.53 లీటర్లు) మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు  జిల్లాలో ఎక్కడైనా మద్యం, ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు తెలిస్తే అక్కడి సమాచారం ఫోటోలు, వీడియోలను 7993822444 సెల్ నెంబర్‌కు  Whatsaap  ద్వారా పంపించాలని  జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Related posts

రాజకీయ జోక్యం ఎక్కువైతే పంచాయితీలు ఇంతే సంగతులు….

Satyam NEWS

‘రెండే రెండు అక్షరాల ప్రేమ’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

Satyam NEWS

ఫేక్ పోలీస్:పోలీసులమంటూ మహిళా ఫై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment