37.2 C
Hyderabad
May 2, 2024 14: 12 PM
Slider కరీంనగర్

కరీంనగర్ శివారు కాలనీల అభివృద్ధి కి ప్రత్యేక దృష్టి

#Gangula Kamalakar

కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు కరీంనగర్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో.. 1 కోటి 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు..డివిజన్ అభివృద్ధి కి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు..

ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ లో కరీంనగర్ ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు…..నగరపాలక సంస్థ లో విలీనం అయిన డివిజన్ ల అభివృద్ధి కి కృషి చేస్తుందని వెల్లడించారు.. రేకుర్తి గ్రామ పంచాయితీగా వున్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని. రేకుర్తి 18,19 డివిజన్ల అభివృద్ధి కి అత్యధికంగా నిధులు కేటాయించామని అన్నారు.. పనులు పురోగతి లో ఉన్నాయని అన్నారు…

రంభించిన పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్లన్నారు..కరీంనగర్ అభివృద్ధి కి ప్రజలు సహకరించాలని అన్నారు..ఈ కార్యక్రమంలోకార్పొరేటర్లుసుధ గుని మాధవి కృష్ణ గౌడ్ ఏదుల్ల రాజశేఖర్ కార్పొరేటర్లు, వి.రాజేందర్ రావు,భూమా గౌడ్, జంగిలి సాగర్ దీండిగాల మహేష్ , గుగ్గిళ్ల శ్రీనివాస్, తుల బాలయ్య బారసా నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీద్, నరేష్ డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related posts

అన్ని పోలీసు స్టేషన్ లలో మహిళా హెల్ప్ డెస్క్ ప్రారంభం

Satyam NEWS

317 జీవోపై పోరాటానికి ఉపాధ్యాయ ఉద్యోగులకు అండగా ఉంటాం

Satyam NEWS

Analysis: రోత పుట్టిస్తున్న రాతగాళ్ల నైజం

Satyam NEWS

Leave a Comment