31.7 C
Hyderabad
May 2, 2024 09: 26 AM
Slider మహబూబ్ నగర్

ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ విజయవంతం చేయాలి

#tejasnandalalpower

నేడు, రేపు నిర్వహిస్తున్న ఓటరు నమోదు  ప్రత్యేక క్యాంపెయిన్ లను విజయవంతం చేసేందుకు బి.ఎల్. ఒ లు, సూపర్వైజర్లు, రెవెన్యూ సిబ్బంది కలిసికట్టుగా  పనిచేసి విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. శనివారం  నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా  గోపాలపేట, రేవల్లి మండలాల పరిధిలోని పలు పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు. తాడిపర్తి లోని 250, 251, 252 పోలింగ్ కేంద్రాలు, గోపాల్ పేట గ్రామంలోని 262-267 పోలింగ్ కేంద్రాలు, రేవల్లి మండల పరిధిలోని 277, 278 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

ఆయా కేంద్రాల పరిధిలో కొత్తగా ఎన్రోల్ చేసుకున్న ఓటర్ల ఫారంలను, జాబితాలను పరిశీలించారు. అదేవిధంగా, చనిపోయిన ఓటర్ల తొలగింపు వివరాలను, డబల్ ఓట్లకు సంబంధించిన వివరాలను పరిశీలించి ఏమైనా లోపాలు ఉంటే సత్వరమే పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఫోటోల పరంగా, భౌగోలిక పరంగా ఉన్న ఎర్రర్స్ తొలగించి ఆన్లైన్ లో తక్షణమే అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. కేశంపేట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో బోర్డు పరీక్షల గురించి సూచనలు చేసారు. కేశంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో వంటశాలను తనిఖీ చేసారు. ఈ సందర్బంగా గోపాలపేట తహసీల్దార్ శ్రీనివాసులు,  రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాదయ్య, బీఎల్వో శివకుమార్, రేవల్లి తహసీల్దార్ లక్ష్మి పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ట్రిబ్యూట్: జర్నలిస్టు మనోజ్ కు కొవ్వొత్తుల నివాళి

Satyam NEWS

బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం

Satyam NEWS

షోకాజ్ నోటీసు జారీ చేయడమే ఎల్ వి చేసిన తప్పు

Satyam NEWS

Leave a Comment