32.7 C
Hyderabad
April 26, 2024 23: 05 PM
Slider ఖమ్మం

హోంగార్డ్స్ ఆదర్శంగా నిలవాలి

#commissioner

పోలీస్ శాఖలోని హోంగార్డు ఆఫీసర్లు నేడు కీలకమైన బాధ్యతలను నిబద్దతతో నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. డిసెంబర్ 6 నాటికి హోంగార్డు ఆర్గనైజేషన్ నెలకొల్పి 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పోలీస్ శిక్షణ కేంద్రంలో   నిర్వహిస్తున్న  క్రీడలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ సమాజానికి హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు భవిష్యత్త్ తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. మానసికంగా ఉల్లాసం నింపేందుకు క్రీడలు ఉపకరిస్తుందని అన్నారు. జిల్లాలో  శాంతి భద్రతలు, క్రైం, ట్రాఫిక్, కమ్యూనికేషన్స్, బందోబస్తు వంటి కీలకమైన విధులలో ఖమ్మం జిల్లా హోంగార్డు విభాగానికి  రాష్ట్రంలోనే మంచి పేరుందన్నారు. కీలకమైన  సమయాలలో  సైతం  సమయస్పూర్తితో వ్యవహరించారని ప్రశంసించారు.  కార్యక్రమంలో  అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు ప్రసన్న కుమార్ ,రవి, సిఐలు చిట్టిబాబు ,శ్రీధర్, సర్వయ్య, అంజలి, ఆశోక్ కుమార్,  ఆర్ఐలు రవి, తిరుపతి, శ్రీశైలం, సాంబశివరావు పాల్గొన్నారు.

Related posts

వరిధాన్యం కొనుగోలుకు మార్కెట్ యార్డు చొరవ

Satyam NEWS

తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది

Bhavani

OTC New Penis Pills

Bhavani

Leave a Comment