29.7 C
Hyderabad
May 6, 2024 03: 10 AM
Slider ప్రత్యేకం

ఓ కారు ఓ బైకు ఓ అనధికార మున్సిపల్ ఉద్యోగి

#kalwakurthy

ఓకారు నెంబర్ ప్లేటును తన ద్విచక్ర వాహనానికి తగిలించుకొని  మున్సిపల్ కార్యాలయంలో ఓఅనధికారఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో అనాధికారికంగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రావు తన ద్విచక్ర వాహనానికి ఓ కార్ నెంబర్ ను తగిలించుకొని పట్టణ పరిధిలోని నూతనంగా నిర్మాణం చేపట్టే గృహ యజమానుల వద్ద, పూర్వం నిర్మాణం చేపట్టిన ఇండ్లు నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టారని ఏదో వంకతో అధికారికంగా నోటీసులు ఇస్తూ అనధికారికంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ మహానుభావుడు గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిజాంపేట్ పురపాలక కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ పలు అక్రమాలకు పాల్పడడం అక్రమాలన్ని బట్టబయలు కావడంతో విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అంతేగాక అదే మెదక్ జిల్లాలోని పలు పురపాలక కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శంషాబాద్ సమీపంలో జెల్పెల్లి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ దాదాపు 30 లక్షల పైనే అవినీతికి పాల్పడినట్లు అక్కడి కమిషనర్ సాబేర్ అలి ఒకానొక సందర్భంలో అక్కడి సిబ్బందితో చర్చించుకుంటూ ఉండగా  చుట్టుప్రక్కల ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రజలు బహిర్గతం చేశారు.

కాగా అటువంటి వ్యక్తిని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ అండగా ఉంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండానే కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో వసూలురాజాగా విధులను ఒప్పజప్పడంపై ఆంతర్యమేమిటని పలు ప్రశ్నలు పట్టణవాసులు సంధిస్తున్నారు.కారు నెంబర్ ను ఎవరికి అంతుచిక్కకుండా తన ద్విచక్ర వాహనానికి తగిలించుకొని ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు ఓ సామాజిక కార్యకర్త ద్వారా బహిర్గతం అయింది.

ద్విచక్ర వాహనానికి దొంగ నెంబర్ ప్లేట్ తో రహదారులపై తిరుగుతున్నాడని జిల్లా పోలీస్ సర్వోన్నత అధికారికి, కల్వకుర్తి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు రాతపూర్వకంగా దాదాపు 20 రోజులు గడుస్తున్న చర్యలు లేకపోవడం గమనార్హం.ఆవాహనంపై ఎవరికైనా ప్రమాదం కలిగిస్తే బాధ్యులు ఎవరని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అవినీతిపరుడైన అనాధికార ఉద్యోగికి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వంతు పాడడంపై ఆశ్చర్యం కలుగుతుందని పట్టణవాసులు బహిర్గతంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి ఆ అనధికారి పై చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

పోల శ్రీధర్, సత్యం న్యూస్. నెట్, కల్వకుర్తి

Related posts

రాజ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన సంచయిత

Satyam NEWS

ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభం

Bhavani

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: పూరి

Satyam NEWS

Leave a Comment