30.7 C
Hyderabad
May 5, 2024 03: 34 AM
Slider ప్రత్యేకం

ఏపి స్పెషల్: అమరావతి లో ‘రెడ్డి’ మేడ్ కష్టాల్

amaravathi

మింగలేక కక్కలేక అన్నట్లుంది వారి పరిస్థితి. పైకి చెప్పలేరు లోన దాచుకోలేరు. సతమతం అవుతున్నారు. ఇంతకీ వీరెవరు అనుకుంటున్నారా? రాజధాని గ్రామాల ప్రజలు. ఆ ప్రజల్లో కూడా 15 వేల కుటుంబాలు. ఈ 15 వేల కుటుంబాల ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? వీరంతా రెడ్డి కులస్తులు.

రాజధాని గ్రామాలలో తరతరాలుగా ఉంటున్నారు. వీరికి ఇక్కడ చాలా మందికి ఎకరం నుంచి 20 ఎకరాల వరకూ భూములు ఉన్నాయి. పంటలు పండించుకుంటూ ఉండేవారు. ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని వారు కూడా అనుకోలేదు. రాష్ట్ర విడిపోవడం రాజధాని రావడం జరిగిపోయింది.

రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ లో ఈ 15 వేల కుటుంబాలలో కొందరు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేశారు. మరికొందరు తాత్సారం చేసి చివరిలో ఇచ్చారు. మరి కొందరు సగం భూమి అమ్ముకున్నారు. సగం ఉంచుకున్నారు. ఎప్పుడైతే రాజధాని వచ్చేసి భూముల విలువ పెరిగిందో ఈ 15 వేల కుటుంబాలలోని వారు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారిపోయారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఏదో కోట్ల రూపాయల టర్నోవర్ చేసేంత కాదు. తమకు పరిచయం ఉన్నవారి భూములు అమ్మిపెట్టడం తమకు తెలిసిన వారు వస్తే సాటి వారిని అడిగి భూములు కొనిపించడం మధ్య లో కొంత కమిషన్ తీసుకోవడం. అంతే. ఇలా వ్యవసాయం పై తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకుంటూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు భూముల అమ్మకాలు కొనుగోళ్లు దాదాపుగా పూర్తి అయినందున ఫ్లాట్లు, ఇళ్లు అమ్మకాలపై వీరు ఆధారపడి ఉన్నారు.

గత ఎన్నికల్లో వీరంతా చందాలు పోగేసుకుని వైసిపి కాండిడేట్లను గెలిపించుకున్నారు. కమ్మ వాళ్ల రాజ్యం అంతరించిందని సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు వారికి తెలిసి వచ్చింది. 15 వేల కుటుంబాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వేల మందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దాదాపు 12 నుంచి 14 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చింది రెడ్డి కులస్తులే. ఇటు భూమీ పోయింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం పోయింది. కమ్మ రాజ్యం అంతరించిందని, రెడ్డి రాజ్యం వచ్చిందని సంతోషించే లోపే వారి ఆనందం ఆవిరైంది. రెడ్డి రాజ్యాన్ని విమర్శిస్తే కమ్మోళ్ల దృష్టిలో చులకన అవుతామని, విమర్శించకపోతే జీవనోపాధి పోతున్నదని రెడ్డి కులస్తులు అంతర్లీనంగా బాధపడుతున్నారు.

అమరావతి నుంచి రాజధాని తరలిపోతే వీరంతా అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేరు. జీవనోపాధి కోసం బయటకు వెళ్లాల్సిందే. ఏం చేయాలో అర్ధం కాక రెడ్లంతా జుట్టుపీక్కుంటున్నారు. పైకి విమర్శించలేరు. ఊరుకోనూ లేరు. పాపం.

Related posts

హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధించిన మహిళా జడ్జి…!

Satyam NEWS

ములుగు  జిల్లా కేంద్రంలో తైక్వాండో పోటీలు

Satyam NEWS

నిరుపేదలను రేప్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోదా?

Satyam NEWS

Leave a Comment