వాహనదారుల మితిమీరిన వేగానికి కళ్లెం వేయడానికి జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. పరిమితికి మించి వేగంగా వెళుతున్న వాహనాలను స్పీడ్‌గన్‌తో గుర్తించి జరిమానా విధించేందుకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. అతివేగంగా వెళ్లే వాహనాల వివరాలు ఆటోమేటిక్ సర్వర్‌కి వెళ్లి వెంటనే చలాన్ నమోదవుతుందన్నారు. వాహన యజమాని 200మీటర్లు వెళ్లేలోపు సెల్‌ఫోన్‌కి మెస్సేజ్ రూపంలో చలాన్ వస్తుందన్నారు. పరిమితికి మించి వేగంతో వెళ్లిన వాహనాలకు 1000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు.
previous post