26.7 C
Hyderabad
May 3, 2024 07: 15 AM
Slider రంగారెడ్డి

సంక్షేమ రంగానికి 47వేల కోట్ల రూపాయల వ్యయం

sabitha indrareddy

రాష్ట్రంలో సంక్షేమ రంగానికి 47 వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల లో నేడు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్  రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితా మాట్లాడుతూ  రాష్ట్రంలోని  బీద, బడుగు, బలహీన వర్గాలు అన్నింటికీ కనీసం కొత్త పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన  2 విడతల  పల్లె ప్రగతి కార్యక్రమంలో  అద్భుతమైన ఫలితాలు లభించాయని, ఈ కార్యక్రమం స్ఫూర్తితో పట్టణ ప్రగతిని ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. 

మార్చ్4వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు వార్డుల వారీగా  యువకులు మహిళలు విద్యావంతులు సీనియర్  సిటిజన్లు 60 మంది తో కమిటీలు వేసామని మంత్రి  తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రతి సంవత్సరం 800 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని దీనిలో భాగంగా ఒక్క రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు  130 కోట్ల  రూపాయల నిధులు వస్తాయని వెల్లడించారు.

తమ బడ్జెట్లో 10 శాతం నిధులను హరితహారానికి కేటాయించాలని స్పష్టం చేశారు. ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలకు   చర్యలు చేపట్టాలని కోరారు. వార్డుల వారీగా స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణ పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రధానంగా తడి పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు స్థానికులను చైతన్యపరిచే బాధ్యత  చేపట్టాలని అన్నారు.  ప్రతి మున్సిపాలిటీలలో ఆట స్థలం,  డంపింగ్ యాడ్ లు,  నర్సరీలు  ఏర్పాటు చేయాలనీ సబితా ఇంద్రా రెడ్డి సూచించారు.

శాసనసభ్యులు మాట్లాడుతూ మీ మున్సిపాలిటీలో   ఉన్న నిధుల ఆధారంగా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో మీరే నిర్ణయించుకోవాలని   కోరారు. ప్రతి వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని,  దశలవారీగా నిధులను మంజూరు చేయనున్నట్టు  అన్నారు. 

అడిషనల్ కమిషనర్ ప్రతీక్ జైన్  మున్సిపల్ చైర్మన్ ఆర్తిక తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఆదిభట్ల లోని పిల్లలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణకు ఏర్పాటుచేసిన 8 వాహనాలను ప్రారంభించారు

Related posts

మల్లయోధుడి తెరచాటు ప్రేమ కథ

Satyam NEWS

ఇతర దేశాల విమానాలు ఆగేందుకు యుఏఈ సుముఖత

Satyam NEWS

మన మనసుకు నచ్చినట్లే తీర్పులు రావాలంటే ఎలా?

Satyam NEWS

Leave a Comment