29.7 C
Hyderabad
May 2, 2024 04: 26 AM
Slider జాతీయం

మల్లయోధుడి తెరచాటు ప్రేమ కథ

#mulayamsinghyadav

మరణించిన రాజకీయ మల్లయోధుడు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో సంచలనాలకు కొదవే లేదు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా సృష్టించిన సంచలనం కూడా అంతా ఇంతా కాదు. ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లో పీక్స్‌లో ఉన్నప్పుడు సాధన గుప్తా ఆయన జీవితంలోకి వచ్చారు. 1982లో ములాయం లోక్‌దళ్‌ అధ్యక్షుడైనప్పుడు సాధన పార్టీలో కార్యకర్తగా పనిచేశారని చెబుతున్నారు.

ములాయం కన్నా ఆమె 20 ఏళ్లు చిన్నది. సాధన మొదటి చూపులోనే ములాయం హృదయాన్ని దోచుకున్నది. ములాయంకు అప్పటికే పెళ్లయింది, సాధన కూడా. సాధన ఫరూఖాబాద్‌కు చెందిన చిన్న వ్యాపారి చంద్రప్రకాష్ గుప్తాను వివాహం చేసుకుంది. అయితే ఆమె అతనితో విడిపోయింది. దీని తరువాత ములాయం సాధనల ప్రేమకథ ప్రారంభమైంది. 80వ దశకంలో సాధన, ములాయంల ప్రేమకథ గురించి అమర్ సింగ్‌కు తప్ప మరెవరికీ తెలియదు. 1988లో సాధనకు ప్రతీక్ అనే కొడుకు పుట్టాడు.

సాధన గుప్తాతో ములాయం ప్రేమ వ్యవహారాన్ని ములాయం మొదటి భార్య, అఖిలేష్ తల్లి మాల్తీదేవికి తెలుసని అంటున్నారు. తొంభైలలో ములాయం ముఖ్యమంత్రి అయ్యాక, ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని అందరికి తెలిసింది కానీ కుటుంబ సభ్యులు ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేదు. దీని తర్వాత 1990లో సాధన గుప్తా మరియు ప్రతీక్ గుప్తాల గురించి అఖిలేష్ తెలుసుకున్నాడు. 1993-2007లో ములాయం హయాంలో సాధన గుప్తా అపారమైన సంపదను సృష్టించుకున్నారు.

ఆదాయపు పన్ను శాఖ వద్ద ఆమె ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెండింగ్‌లో ఉంది. 2003లో అఖిలేష్ తల్లి మాల్తీ దేవి అనారోగ్యంతో మరణించడంతో ములాయం దృష్టి అంతా సాధనా గుప్తా వైపు మళ్లింది. మాల్తీ దేవి మరణం తర్వాత తనను అధికారిక భార్యగా అంగీకరించాలని సాధన ములాయం ను కోరారు. అయితే కుటుంబ ఒత్తిడి కారణంగా, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ వత్తిడి మేరకు, ములాయం ఈ సంబంధాన్ని పబ్లిక్ గా అంగీకరించేందుకు ముందుకు రాలేకపోయారు.

2006లో సాధన అమర్ సింగ్‌ను కలవడం ప్రారంభించి ములాయంని ఒప్పించాలని కోరుతూ వచ్చారు. సాధన గుప్తా, ప్రతీక్ గుప్తాలను దత్తత తీసుకోవాలని అమర్ సింగ్ నేతాజీ (ములాయం) పై వత్తిడి తేవడం ప్రారంభించరు. 2007 సంవత్సరంలో సాధనను తన భార్యగా అంగీకరించాలని అమర్ సింగ్ ములాయంను బహిరంగ వేదిక నుండి కోరారు. ఆ తర్వాత ములాయం అంగీకరించారు. అయితే అఖిలేష్ దానికి అస్సలు సిద్ధంగా లేరు. ములాయం సింగ్ యాదవ్ మొదటి వివాహం 18 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులు చేశారు. ఆ సమయంలో ములాయం 10వ తరగతి చదువుతున్నాడు. పెళ్లి నాటికి ములాయం 5 గేదెల బండ్లతో వ్యాపారం చేసుకునేవాడు.

Related posts

Big Boss 4: కోట్లాది మందికి వినోదం నాకు ఆనందం

Satyam NEWS

గ్యార్మీ ఉత్స‌వాల‌కు హాజ‌రైన ఎంపీఆర్‌

Satyam NEWS

పన్ను చెల్లింపుదారులను మోసం చేసిన నిర్మల

Satyam NEWS

Leave a Comment