29.7 C
Hyderabad
May 2, 2024 04: 09 AM
Slider ఖమ్మం

మహిళా ఉద్యోగుల క్రీడలు ప్రారంభo

#tngos

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకుని ఈ నెల 5 నుంచి 8వరకు జరిగే క్రీడా,సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు షేక్.అప్జల్ హసన్,ఆర్.వి.ఎస్.సాగర్ ల నేతృత్వంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శాబాసు జ్యోతి,స్వప్న గార్ల ఆధ్వర్యం లో ఆదివారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం లో మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడలను జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూధన్  జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత,జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూధన్ మహిళా ఉద్యోగుల క్రీడలను ఉద్దేశించి మాట్లాడుతూ  రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీఎన్జీవోస్ యూనియన్  ఉద్యోగుల్లో ఐక్యతను చాటేందుకు దోహదపడే క్రీడాపోటీలను నిర్వహించడం పట్ల అభినందించారు. సంవత్సర కాలమంతా తీవ్ర పని ఒత్తిడితో ఉండే మహిళ మణులకు ఈ ఆటలపోటీలు ఆట విడుపును ఇస్తాయని తెలిపారు.క్రీడలు మహిళలకు నూతనోత్తేజంతో పాటుగా మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.మహిళా ఉద్యోగులు క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  ఈ  క్రీడా సాం స్కృతిక  పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున  ఉత్సాహంగా పాల్గొన్నారు .

Related posts

అంబేద్కర్ విగ్రహాన్ని తగులబెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

టిటిడి జెఈవో(విద్య, ఆరోగ్యం)గా నందలూరు వాసి భార్గ‌వి

Satyam NEWS

ఈవీఎం లపై ఓటర్లకు అవగాహన

Bhavani

Leave a Comment