34.2 C
Hyderabad
May 11, 2024 20: 04 PM
Slider జాతీయం

శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై మూడు నెలల్లో కేసుల పరిష్కారం

#srikrishnajanmasthanam

మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. షాహీ ఈద్గాపై శాస్త్రీయ సర్వే చేయాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. మధుర కోర్టులో దాఖలైన అన్ని దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది.

జస్టిస్ విపిన్ చంద్ర దీక్షిత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ న్యాయవాది ఆదిష్ అగర్వాల్, శశాంక్ సింగ్ పిటిషనర్ల తరపున వాదించారు.

పిటిషనర్ల తరపు న్యాయవాదులు మాట్లాడుతూ, “షాహీ ఈద్గా కాంప్లెక్స్‌పై శాస్త్రీయ పరిశోధన, సర్వే చేయాలని కోరుతూ సివిల్ జడ్జి మధుర కోర్టులో దరఖాస్తు చేశారని అయితే దీనిపై ప్రతిపక్ష సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు.

సున్నీ వక్ఫ్ బోర్డు వినతి మేరకు కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. తమ పిటిషన్లను త్వరగా విచారించాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఏప్రిల్ 14న సున్నీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన దరఖాస్తుపై ఇచ్చిన స్టేను తొలగించాలని కోరారు. దీనిపై హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.

Related posts

కరోనా ఎలర్ట్: చచ్చిపోతారని చెబుతున్నా వినకుండా…

Satyam NEWS

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS

ఆశ్రమ పాఠశాలల మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి

Satyam NEWS

Leave a Comment