28.7 C
Hyderabad
April 28, 2024 05: 55 AM
Slider మెదక్

టీటా గ్లోబ‌ల్ ఎన్నారై జాయింట్ సెక్ర‌ట‌రీగా భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల‌

#prakash

నియామ‌క ప‌త్రం అంద‌జేసిన నీటి వ‌న‌రుల సంస్థ చైర్మ‌న్ వి.ప్ర‌కాష్‌, టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల‌

స్వ‌దేశంతో పాటుగా విదేశాల్లోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు అండ‌గా ఉండేందుకు వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) ఇందులో భాగంగా ప్ర‌ముఖ ఎన్నారై భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల‌ను టీటా గ్లోబ‌ల్ ఎన్నారై జాయింట్ సెక్ర‌ట‌రీగా నియ‌మించారు.

సిద్ధిపేట జిల్లా నుంచి సింగ‌పూర్ వెళ్లి 15 ఏళ్లుగా స్థానిక ఎన్నారైల‌కు వివిధ అంశాల్లో సేవ‌లు అందించ‌డంతో పాటుగా యువ‌త‌కు స్కిల్లింగ్‌లో శిక్ష‌ణ ఇస్తున్న భాస్క‌ర్ గుప్త‌ నూత‌న బాధ్య‌త‌ల నియామ‌క ప‌త్రాన్ని తెలంగాణ నీటి వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ వి.ప్ర‌కాష్‌, టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల నుంచి నేడు స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా భాస్క‌ర్ గుప్త న‌ల్ల‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ టీహ‌బ్2 వైపు ఆవిష్క‌ర్త‌ల‌ను ఆక‌ర్షించ‌డం, తెలంగాణలోని గ్రామాల ద‌త్త‌త మ‌రియు రైతుల అభివృద్ధికి ఎన్నారైలు చేయుత అందించేలా కృషి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. టీటా గ్లోబ‌ల్ చాప్ట‌ర్ల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉండ‌టంతో పాటుగా ఎన్నారైల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పాటుప‌డనున్న‌ట్లు వివ‌రించారు.

సొంత జిల్లా సిద్ధిపేట జిల్లా నారాయ‌ణ‌రావుపేట మండ‌ల వాసి అయిన భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల 2002లో మ‌లేషియా 2007వ‌ర‌కు మ‌లేసియాలో ఐటీ ఉద్యోగం చేసి అనంత‌రం మెరుగైన అవ‌కాశాలు రావ‌డంతో సింగ‌పూర్‌కు చేరుకున్నారు. 2008లో శాశ్వ‌త నివాసం, 2020 సింగ‌పూర్ పౌర‌స‌త్వం పొందిన భాస్క‌ర్ సింగ‌పూర్ టీటా టీంలో 2018 నుంచి జాయింట్ సెక్ర‌ట‌రీగా సేవ‌లు అందిస్తున్నారు. సింగ‌పూర్ కేంద్రంగా ఉన్న ఎన్నారైల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను గుర్తించిన టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల‌ను టీటా గ్లోబ‌ల్ ఎన్నారై జాయింట్ సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తూ నేడు నియామ‌క ప‌త్రం అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా సందీప్ మ‌ఖ్త‌ల మాట్లాడుతూ సింగ‌పూర్‌లోని ఎన్నారైల‌కు నైపుణ్య శిక్ష‌ణ‌, తెలుగు ఎన్నారైల‌కు వివిధ స‌మ‌స్య‌ల‌పై స్పందించిన తీరుతో టీటా గ్లోబ‌ల్ ఎన్నారై జాయింట్ సెక్ర‌ట‌రీగా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. ఐటీ, సేవారంగంలో భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల‌ అనుభ‌వం ఆధారంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న దేశాల్లో టీటా వృద్ధికి కృషి చేస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో ఐటీ రంగ అభివృద్ధికి భాస్క‌ర్ సేవ‌లు ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

టీటా గ్లోబల్‌ ఎన్నారై జాయింట్ సెక్ర‌ట‌రీగా నియ‌మితులైన భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి మ‌రియు టీటా బ‌లోపేతానికి వివిధ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగనున్న‌ట్లు పేర్కొన్నారు.

తెలంగాణ క‌ల్చ‌ర‌ల్ సొసైటీ సింగ‌పూర్ (టీసీఎస్ఎస్) సింగ‌పూర్ ఉపాధ్య‌క్షుడు, వ‌ర‌ల్డ్ ఆర్య‌వైశ్య మ‌హాస‌భ సింగ‌పూర్ చాప్ట‌ర్ అధ్య‌క్ష హోదాను స‌ద్వినియోగం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల ద‌త్త‌త కోసం ఇప్ప‌టికే సింగ‌పూర్లో ప‌లువురు ఎన్నారైల‌తో చ‌ర్చ‌లు జ‌రిపామ‌ని త్వ‌ర‌లో వాటిని అమ‌లు చేయ‌నున్న‌ట్లు భాస్క‌ర్ గుప్త న‌ల్ల వివ‌రించారు. యువ‌త‌కు రీ స్కిల్లింగ్ & అప్ స్కిల్లింగ్, టీహ‌బ్ ఇన్నోవేష‌న్ లో భాగస్వామ్యం, ఎన్నారై చాప్ట‌ర్ విస్త‌ర‌ణ‌, టీటా గ్లోబ‌ల్ క‌న్వెన్ష‌న్ విజ‌య‌వంతం చేయ‌డం వంటివి ప‌లువురు టెక్కీల‌తో ప్ర‌తిపాద‌న‌లు పంచుకున్నామ‌ని వాటిని రాబోయే రోజుల్లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Related posts

రేవంత్ రెడ్డి తరపున షబ్బీర్ అలీ నామినేషన్

Satyam NEWS

బతుకమ్మవే

Satyam NEWS

రైతు ఉత్ప‌త్తి దారుల సంస్థ‌ల ద్వారా మామిడి కాయ‌ల కొనుగోలు

Satyam NEWS

Leave a Comment