37.2 C
Hyderabad
May 6, 2024 11: 33 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలంలో ఇక ఆన్ లైన్ ద్వారా మాత్రమే సేవలు

#srisailam

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఆర్జిత సేవా మరియు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు లభిస్తాయని ఈవో లవన్న తెలిపారు. శ్రీశైలంలో మే 1వ తేదీ నుండి అన్ని ఆర్జిత సేవలు మరియు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లను ఆన్ లైన్ ద్వారానే జారీ చేయాలని దేవస్థానం వారు నిర్ణయించారు. ఏప్రిల్ 25వ తేదీ నుండి ఆయా అర్జిత సేవలు మరియు స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు దేవస్థానం ‘www.srisailadevasthanam.org‘ వెబ్ సైట్ లో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటవ తేదీ నుంచి టికెట్లు కరెంటు బుకింగ్ ద్వారా ఇవ్వబడవు. ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందిన ఆర్జిత సేవాకర్తలకు టికెట్ పై సూచించిన సమయంలో మాత్రమే ఆయా ఆర్జిత సేవలను జరిపించుకునే అవకాశం కల్పించబడుతుంది. సేవాకర్తలు వారి సేవా సమయం కంటే 15 నిమిషాలు ముందుగా ఆర్జిత సేవా క్యూ లైన్ ప్రవేశం ద్వారం వద్ద రిపోర్టు చేయవలసి ఉంటుంది.

Related posts

ప్రచారంలో ముందున్న…. డాక్టర్ చదలవాడ

Satyam NEWS

సౌకర్యాలు కల్పించకుండా మార్కెట్ ఎందుకు తరలించారు?

Satyam NEWS

సూప‌ర్ఉమెన్ మూవీ ఇంద్రాని నుండి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

Satyam NEWS

Leave a Comment