29.7 C
Hyderabad
April 29, 2024 10: 30 AM
Slider ప్రకాశం

షార్ట్ సర్క్యూట్ తో చిల్లర దుకాణం దగ్ధం

#fireaccident

షార్ట్ సర్క్యూట్ తో చిల్లర దుకాణం దగ్ధమైన సంఘటన ప్రకాశం జిల్లా దర్శిలో గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని క్రిస్టియన్ పాలెం కు చెందిన గర్నెపూడి లింగయ్య భార్య లీలమ్మ కు చెందిన చిల్లర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దీంతో దుకాణంలో ఉన్న టీవీతోపాటు చిల్లర వస్తువులు కాలి బూడిద అయ్యాయి. సుమారు 40, వేల వరకు నష్టం వాటిలినట్టు దుకాణ నిర్వాహకులు తెలిపారు. పేదవారమై తాము చిన్న చిల్లర దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఇప్పుడు దుకాణం కాలిపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆమె ఆవేదన పెళ్ళబుచ్చింది. ప్రభుత్వం తమకు సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

Corona: ఇంట్లో దాక్కొనే కాలం మళ్లీ దాపురిస్తుందా…?

Satyam NEWS

తిరుమలలో భక్తుల రద్దీ

Bhavani

నకిలీ వేలిముద్రతో 14వ ఆర్ధిక సంఘం నిధుల దోపిడి

Satyam NEWS

Leave a Comment