28.7 C
Hyderabad
May 6, 2024 10: 42 AM
Slider నిజామాబాద్

కళలకు ప్రాణం పోస్తున్న కళాకారులు

#brahmamgaru

గ్రామాల్లో కొనసాగుతున్న బ్రహ్మంగారి చరిత్ర నాటకాలు

అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోసేందుకు కళాకారులు చేస్తున్న కృషి అంతాఇంతా కాదు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం వివిధ దేవతమూర్తుల చరిత్రను తెలిపే నాటకాలు వేసేవారు. ముఖ్యంగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, రేణుక ఎల్లమ్మ లాంటి కథలను మూడు నుంచి ఐదు రోజుల పాటు నాటక రూపంలో వేసి ప్రజలకు ఆ చరిత్రను వినిపించేవారు.

కాలజ్ఞానం చెప్తున్న దృశ్యం

రాను రాను సినిమాలు, మొబైల్స్, ఇంటర్నెట్ పుణ్యమా అని ఆ నాటకాలు కనుమరుగై పోయాయి. దాంతో ఆ నాటకాల్లో పాత్రలు వేసి మెప్పించిన కళాకారులు కనుమరుగైపోయారు. ఇటీవల నాటి సంస్కృతి మళ్ళీ తెరపైకి వస్తుంది. గత కొద్దిరోజులుగా ఒక్కొక్క గ్రామంలో కనుమరుగైపోతున్న నాటకాలకు మళ్ళీ పురుడుపోస్తున్నారు. గ్రామాల్లోని ప్రజలు నాటి చరిత్రను కళ్ళముందు కట్టినట్టుగా చూడటానికి ఇష్టపడుతున్నారు.

దాంతో ఆయా గ్రామాల్లో సుమారు నెల నుంచి రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుని నాటకాలు వేస్తున్నారు. తాజాగా సదాశివనగర్ మండలం తుక్కోజీవాడి గ్రామంలో రెండు రోజులుగా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్ర నాటకం వేస్తున్నారు. గ్రామంలో కొన్నేళ్లుగా కనుమరుగైన నాటకం మళ్ళీ మొదలు కావడంతో ప్రజలు అత్యధిక సంఖ్యలో నాటకం చూడటానికి ఆసక్తి చూపించారు.

ముఖ్యంగా యువత ఈ నాటకానికి ప్రత్యేకంగా ఆకర్షితులు కావడంతో పాటు నాటకంలో పాత్రలు కూడా పోషించడం గమనార్హం. సోమవారం రెండవ రోజు బ్రహ్మంగారి చరిత్ర కొనసాగింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం, సిద్ధప్ప ఎంట్రీ, వివిధ ఘట్టాలు ప్రేక్షక ప్రజలను ఎంతగానో అలరించాయి. నాటకం మధ్యమధ్యలో బుడ్డర్ఖాన్ వేషధారణలతో కామెడీ చేస్తూ ప్రజలకు ఆసక్తిని పెంచారు.

నాటకంలో భాగంగా శవం యాత్ర చేస్తున్న దృశ్యం

Related posts

పకడ్బందీగా టెట్ పరీక్ష

Bhavani

రెవెన్యూ అధికారులు నిద్రలో.. అక్రమార్కుల సంపాదన కోట్లల్లో

Bhavani

కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment