40.2 C
Hyderabad
May 2, 2024 18: 31 PM
Slider కడప

నక్షత్ర తాబేలును ఫారెస్ట్ అధికారులకు అందజేసిన పూజారి

#Vempally

కడప జిల్లా వేంపల్లె లో అరుదైన నక్షత్ర తాబేలు కనిపించింది.

దారిన పోయే కుక్కలు నక్షత్ర తాబేలుపై దాడి చేస్తుండగా అక్కడి ఒక పూజారి వాటి బారి నుంచి నక్షత్ర తాబేలును రక్షించారు. ఆ తర్వాత దాన్ని  సురక్షితంగా  ఫారెస్ట్ అధికారులకు అందచేశారు.

ఈ ఘటన కడప జిల్లా వేంపల్లె పట్టణ సమీపంలోని వృషభ మల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో ఉన్న ఎద్దులకొండ వద్ద చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఎద్దులకొండ స్వామి ప్రధాన అర్చకుడు  హరి ప్రవీణ్  రోజూలాగే స్వామివారికి పూజలు చేసేందుకు వేంపల్లె నుంచి ఎద్దుల కొండకు వెళ్తుండగా  మార్గం మధ్యలో  కుక్కలు నక్షత్ర తాబేలు తో ఆటలడుతుండగా చూశాడు.

వెంటనే వాటిని అదిలించి తాబేలును సురక్షితంగా తీసుకొని  వేంపల్లె పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి  అధికారులకు అందజేశారు.

Related posts

ఉప్పల్ లో బిజెపి జెండా ఎగరేయడం ఖాయం

Satyam NEWS

వాళ్ళిద్దరు కలిశారంటే జగన్ పార్టీ పని అవుట్

Satyam NEWS

సివిల్ వివాదంలో తలదూర్చిన సిఐ పై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

Leave a Comment