42.2 C
Hyderabad
May 3, 2024 18: 12 PM
Slider కరీంనగర్

తెరిపిన పడుతున్న తెలంగాణ రైతుల్ని చూసి ఈర్ష్యపడుతున్న బీజేపీ

#ministergangula

రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి రాజకీయ పబ్బం గడుపుకునే నీచ ఆలోచనలతో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల అయోమయ స్థితిని, ఆందోళనలను తగ్గించాల్సిన బాధ్యతగల కేంద్ర ప్రభుత్వాన్ని యాసంగి ధాన్యం కొంటారా? లేదా? అని అడిగితే సమాదానం చెప్పకుండా రైతాంగాన్ని మరింత అయోమయానికి గురిచేసేలా బిజెపి ప్రవర్తిస్తున్నదని ఆయన అన్నారు.

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా 6663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి పంటలు వస్తున్న దానికి అనుగుణంగా ఏరోజుకారోజు కొత్త కేంద్రాలు ఏర్పాటుచేస్తూ ఇప్పటికే 3500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. వీటిద్వారా 72,000 మంది రైతుల నుండి 5,15,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని నుండి వీటి విలువ వెయ్యికోట్లు ఉంటుందన్నారు. ఈరోజు బీజేపీ జిల్లాల్లో నిర్వహించే ధర్నాలపై కరీంనగర్లో మిడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ నేతలు ధర్నా అంటే రైతులకు మద్దతుగా ధర్నా చేస్తారనుకున్నాం, కానీ అర్థం పర్థం లేని ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. విషయం అర్థంకాని దద్దమ్మలు బీజేపీ నేతలని మంత్రి అన్నారు.

కేంద్రం తీసుకుంటామని స్పష్టంగా చెప్పకపోయినా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, చురుగ్గా కొనుగోళ్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వడ్లను మిల్లింగ్ చేసి ఎఫ్.సి.ఐ అడిగిన ప్రకారం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాని, బండి సంజయ్ కానీ ఇతర బీజేపీ నేతలెవరైనా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బియ్యం మొత్తం తీసుకునేలా చేయగలరా అని ప్రశ్నించారు మంత్రి గంగుల. కరోనా సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా రెండు మూడు గ్రామాలకు ఒకటి కాకుండా ప్రతీ గ్రామంలో ఉండేవిదంగా గతంలొ 6500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈసారి మరిన్ని పెంచి 6663 కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.

ప్రతీ గ్రామంతో పాటు కొన్ని గ్రామాల్లో రెండు కొనుగోళ్లు కేంద్రాలు సైతం ఏర్పాటు చేసామన్నారు. పావుశాతం కోతలు మాత్రమే జరిగాయని, కొతలు ఎట్లెట్లా పెరుగి ఆరబెట్టి ఎఫ్.సి.ఐ నిర్దేశించిన 17 శాతం కన్నా తక్కువ తేమ శాతం వచ్చాకే రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేస్తారని ఆ విదంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జరుగుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలకు రైతులపై ప్రేముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు మంత్రి గంగుల.

కరీంనగర్ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలకు గానూ 346 తెరిచాం

సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, రైతుబందు, 24గంటల కరెంటు, పుష్కలమైన నీరు అందిస్తూ రైతులకు అండగా ఉంటుంటే, బంగారు పంటలు పండించిన రైతుల ధాన్యాన్ని కొనకుండా ఇబ్బంది పెడుతుంది కేంద్రం అన్నారు. గతంలో కోతకోసి, బంతికొట్టి, తూర్పారబట్టి, అరబెట్టి అమ్మేటోళ్లం ఇప్పుడు కళ్లాలు లేవని బీడు బూములు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వడ్లు ఆరబెట్టుకుంటున్నారన్నారు మంత్రి గంగుల. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ఇతర జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్ :చైనా నుండి వచ్చిన విద్యార్థులకు పరీక్షలు

Satyam NEWS

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కు పాత్రుని వలస విద్యార్థుల ఎంపిక

Satyam NEWS

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Satyam NEWS

Leave a Comment