37.2 C
Hyderabad
May 6, 2024 11: 05 AM
Slider విజయనగరం

పొట్టి శ్రీరాములు చిత్ర ప‌ఠానికి పూల‌మాల‌లు వేసిన విజయనగరం ఓఎస్డీ

#vijayanagaramosd

విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ కార్యాల‌యంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా  అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి ఓఎస్డీ  ఎన్.సూర్యచంద్ర రావు పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ ఎన్.సూర్యచంద్ర మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజలకు న్యాయం జరుగుతుందని, తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు  ఉద్యమించార‌న్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, 56 రోజులు నిరాకంటంగా దీక్ష చేపట్టి, మృతి చెంద‌డం జరిగిందన్నారు.

పొట్టి శ్రీరాములు గారి మరణం తరువాతనే కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను గుర్తించింద‌న్నారు. కర్నూల్ రాజధానిగా నవంబరు 1, 1956న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. తెలుగు రాష్ట్రం ఏర్పడుటకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించి, స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఓఎస్డీ శ్రీ ఎన్.సూర్యచంద్ర రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు  రాంబాబు,  రుద్ర శేఖర్, వెంకటరావు, ఎఓ వెంకట రమణ,  ఆర్ ఐలు చిరంజీవి,  నాగేశ్వరరావు,  మరియన్ రాజు,  కుమార్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి, నివాళులు అర్పించారు.

Related posts

కొమరం భీమ్ పాత్ర తలపై ముస్లిం టోపీ తీసేయాలి

Satyam NEWS

కరోనా పై కేంద్ర వైఫల్యాన్ని ప్రశ్నించిన పిటీషన్ కొట్టివేత

Satyam NEWS

పోలీసు బందోబస్తు నడుము చాగంటి కి”గురజాడ” విశిష్ట పురస్కారం…..!

Satyam NEWS

Leave a Comment