36.2 C
Hyderabad
May 7, 2024 11: 49 AM
Slider ఆదిలాబాద్

చట్టబద్ద హెచ్చరిక: పొగాకు ఉత్పత్తుల ప్రచారం నేరం

#tobacoproducts

పొగాకు ఉత్పత్తుల ప్రచారం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం అదిలాబాద్  పట్టణంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పొగ త్రాగడం వల్ల ఇతరులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న మరణాల్లో పొగ తాగేవారు, పొగ పీల్చే వారే అధికంగా ఉన్నారని వెల్లడించారు. పొగ తాగడం, గుట్కా నమలడం వల్ల కాన్సర్ తో పాటు శ్వాస సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. దుకాణదారులు విధిగా పొగ తాగటం నేరం అని రాసిన హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

పొగాకు ఉత్పత్తుల ప్రచారం కోసం ఎలాంటి స్టిక్కర్లు అంటించ కూడదని అన్నారు. నిబంధనలు పాటించాలని, లేకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బహిరంగ ధూమపానం చేసిన ఇద్దరికి జరిమానాలు విధించారు. ఆయన వెంట చిరంజీవి, ఆశన్న ఉన్నారు.

Related posts

పేదలు ఆర్థికంగా బలపడేలా అభివృద్ది పథకాలు

Satyam NEWS

జగన్ ఉంటే మద్యపానం నిషేధం లేదు ప్రత్యేక హోదా రాదు

Satyam NEWS

మంచి మందులు రాయితీపై ఇవ్వాల్సిన అవసరం ఉంది

Satyam NEWS

Leave a Comment