Slider కరీంనగర్

బ్లాక్ షిప్:రాజన్నహుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

hindi theft vemulawada

ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న హుండీ లెక్కింపు లో ప్రతి సారి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతుంది.వెరసి ఉద్యోగులు ఎదో విధంగా తమ చేతి వాటం చూపిస్తూనే ఉన్నారు.దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లు గా ఉంది ఉద్యోగుల వైనం.వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు చేపడుతుండగా ఉద్యోగి చేతివాటం చూపించాడు.

దేవాలయం లో పనిచేస్తున్న దేవయ్య లెక్కింపులో9 వేల రూపాయలు తీసి దాచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ పట్టుబడ్డాడు.ఐదువందల నోట్లు మొత్తం 18 దొంగలించినట్లు సీసీ టీవీ పుటేజీల ద్వారా ఆలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. నిందితుడు దేవయ్య నుంచి రూ.9వేలు నగదు స్వాధీనం చేసుకుని అతడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా దేవయ్య ను సస్పెండ్ చేస్తున్నట్లు దేవాలయ ఈ ఓ కృష్ణవేణి తెలిపారు.

Related posts

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సైకిల్ యాత్ర

Satyam NEWS

1000 మంది జంటల వికృత రాసలీలలు

Sub Editor

వరదల కారణంగా ఆర్ధికంగా పతనమైన పాకిస్తాన్

mamatha

Leave a Comment