31.2 C
Hyderabad
May 2, 2024 23: 43 PM
Slider విశాఖపట్నం

కోవిడ్ నిబంధనల మేరకే సింహాచలంలో దైవ దర్శనం

pjimage

ప్రముఖ పుణ్య క్షేత్రమైన సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృహింసస్వామి వారి దేవాలయంలో పూర్తి స్థాయి కోవిడ్ నిబంధనలతో దర్శనాలకు వీలుకల్పించారు.

భక్తులకు మాస్క్, భౌతిక దూరం, శానిటైజేషన్ తప్పనిసరి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి M.V. సూర్యకళ తెలిపారు.

ఆలయం లోపల, బయట మొత్తం శానిటైజేషన్ చేస్తున్నామని ఆమె వెల్లడించారు. మాస్కులేని భక్తులను దేవాలయంలోకి అనుమతించడం లేదని ఆమె స్పష్టం చేశారు.

భక్తులు కచ్చితంగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలని, దాని కోసం శానిటైజర్ అందిస్తున్నామని ఆమె వెల్లడించారు.

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ భక్తులను అనుమతిస్తున్నామని కార్యనిర్వహణాధికారి తెలిపారు.

అదే విధంగా భక్తుడికి భక్తుడికి మధ్య ఆరు అడుగుల దూరం తప్పనిసరి చేశామని, అందువల్ల గంటకు 2 వేల మందికన్నా ఎక్కువ మందికి అనుమతి లేదని ఆమె వెల్లడించారు.

ఏ ఉద్యోగికైనా జ్వరం వస్తే డ్యూటీకి రావొద్దంటున్నామని, పారాయణదారుల్లో 50 శాతం మందినే డ్యూటీకి రావాలని చెప్తున్నామని ఆమె వెల్లడించారు.

దేవునికి ఎలాంటి లోటు రాకుండా పూజలు అన్నీ సంప్రదాయబద్ధంగానే చేస్తున్నామని ఆమె వివరించారు.

Related posts

అమెరికాలో కొలువుదీరిన “కూచిపూడి పలావ్”

Satyam NEWS

ఇంజక్షన్ వికటించి యువకుడు మృతి

Bhavani

ముత్య‌పు పందిరి వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడు

Satyam NEWS

Leave a Comment