38.2 C
Hyderabad
April 29, 2024 19: 23 PM
Slider ముఖ్యంశాలు

ఆక్సిజన్ అందిస్తున్నాం… కొంచెం ఓపిక పట్టండి

#puspavani

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్ర హాస్ప‌ట‌ల్ లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కార‌ణంగా ఇద్ద‌రు మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్థానిక మంత్రి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి స్పందించారు.

ఆసుపత్రి లో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామ‌న్నారు. జిల్లా కలెక్టర్, డీసీ హెచ్ ఎస్, సూపరింటెండెంట్ తో మాట్లాడాన‌ని…వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని  దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళానని చెప్పారు.

ఐసీయూ లో ఉన్న రోగులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పంపిణీ లో ఇబ్బంది ఉందని 15 మందిని తక్షణమే తిరుమల ఆసుపత్రి కి తరలించామన్నారు.

అయితే ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించ లేదని…కాని ఆక్సిజ‌న్ అంద‌ని రోగుల‌ను తక్ష‌ణ‌మే ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద తిరుమ‌ల హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించామ‌న్నారు.

పరిస్థితి  సీరియస్ గా ఉంటే విశాఖ కు తరలించమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారని డిప్యూటీ సీఎం తెలిపారు.

విజయనగరం జిల్లాలో అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు.

ఆక్సిజన్ కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేచి ఉండాలని ఆమె కోరారు.

Related posts

రోజుకో మాట: కొత్త పార్టీ పెట్టడం లేదని ప్రశాంత్ కిశోర్ ప్రకటన

Satyam NEWS

రికగ్నైజేషన్: నీతి ఆయోగ్ కార్యదర్శిగా ఎల్ వి?

Satyam NEWS

వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Bhavani

Leave a Comment