కరోనా వైరస్ వ్యాప్తిపై పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తగిన చర్యలు ప్రారంభించారు. కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్ సెక్షన్ 54 కింద కేసును నమోదు చేస్తామని ఆయన అన్నారు.
ఈ సెక్షన్ కింద దాదాపు ఏడాది జైలు, జరిమానా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన కలుగుతుందని ఇది ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు.