కరోనా వైరస్ పై పోరాటానికి భారత సైన్యం కూడా ముందుకు వచ్చింది. విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చి కరోనా వైరస్ ను పరీక్షించేందుకు అవసరమైన 14 రోజుల క్వారంటైన్ సౌకర్యాలు అందించేందుకు రాజస్థాన్ లోని జైసల్మేర్ లో వెల్ నెస్ సెంటర్ ను భారత సైన్యం ప్రారంభించింది.
ఇరాన్ నుంచి తీసుకువచ్చిన 236 మంది భారతీయులను ఇప్పుడు ఇక్కడే సురక్షితంగా ఉన్నారు. జైసల్మేర్ వద్ద ఉన్న వెల్ నెస్ సెంటర్ లో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి పూర్తిగా సన్నద్ధమైన, నిపుణులైన వైద్యాధికారుల పర్యవేక్షణలో క్వారంటైన్ సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తున్నారు.
విదేశాల నుంచి తిరిగొచ్చిన మన దేశస్థులకు కరోనా వైరస్ నుంచి రక్షణ అందించేందుకు సైనికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తిరిగి వచ్చిన పౌరులందరికీ సరైన సంరక్షణ అందించడం కోసం సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ పోర్ట్ అధికారులు, ఎయిర్ ఫోర్స్ తో ఆర్మీ వెల్ నెస్ సెంటర్ సమన్వయంతో పనిచేస్తోంది.
అదే విధంగా కోవిడ్-19 గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలను కూడా ఆర్మీ చేపట్టింది. ఏదైనా అవసరమైన పరిస్థితులను హ్యాండిల్ చేయడం కోసం వైద్య మౌలిక సదుపాయాలకు సంబంధించి భయపడాల్సిన అవసరం లేదని రాజస్థాన్ డిఫెన్స్ పిఆర్ఓ కల్నల్ సంబిత్ ఘోష్ తెలిపారు.