Slider అనంతపురం

విహార యాత్రలో రోడ్డు ప్రమాదం: విద్యార్ధులకు గాయాలు

students

తమిళనాడు రాష్ట్రం లోని కొడైకొనల్ కు విహార యాత్ర కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం విద్యార్ధులకు శాపమైంది. అనంతపురం వికాస్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థులు  రెండు బస్సులలో సుమారు 100 మంది ఈ టూర్ కు వెళ్లారు. వారు తిరిగి అనంతపూర్ కు వస్తున్న సమయంలో ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ బస్సు ఓవర్ ట్రాక్ చెయ్యబోయి వెనుక వైపు ఢీ కొట్టింది.

దాంతో  ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్ధులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం పంపారు. ఒక్క విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఆఫ్రిద్, ఫర్దిన్, అభిలాష, చరణ్, శ్రీనాథ్, సంతోష్ కుమార్, చరణ్ తేజ్, నవీన్ తదితరులు ఉన్నారు.

Related posts

కొండగట్టు ఆలయ పునర్ నిర్మాణంలో గ్రీన్ ఇండియా భాగస్వామ్యం

Satyam NEWS

ధోనీ రిటైర్మెంట్ అయ్యే రోజు ఇదే

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి

Satyam NEWS

Leave a Comment